గులాబి రేకుల్లో అలజడి మొదలైంది. తెలంగాణ భవన్ ల్లో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో సునామీ రాబోతుంది. ఇప్పటికే బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు పై తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రఘునందన్ రావు చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ నాయకత్వానికి 48 గంటల గడువు విధించడం, స్పందించకపోతే గుట్టు రట్టు చేస్తానని అల్టిమేటం జారీ చేయడం అన్ని వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. పార్టీలోనూ, బయట పార్టీలోను, ప్రజల్లోనూ ఈ అంశం వాడివేడి చర్చలకు పురిగొల్పు తోంది.
ఇంతకూ వసూళ్ళకు సంబంధించిన చెక్కుల జిరాక్స్‌లు, చర్చలకు సంబంధించిన సీడీలను రఘునందన్‌రావు బయటపెట్టి గులాబీ నేత కేసీఆర్‌ను ఢీకొనేనా? లేదా తోక ముడిచేనా? అనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. తెరాస నుండి గతంలో పలువురు ముఖ్య నేతలు క్రమశిక్షణా చర్యలకు గురయ్యో, వారికి వారు బయటకు వెళ్ళడమో జరిగింది.
అటువంటి వారంతా ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. అయితే ఆ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన మెదక్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావు కేసీఆర్, హరీష్ రావుల పై చేసిన ఆరోపణలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పార్టీ అధిష్టానానికి ఆయన పెద్ద సవాలే విసిరారు. తన సస్పెన్షన్‌కు గల కారణాలను వివరించాలని తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. దీంతోపాటు పార్టీకి 48 గంటల గడువునిచ్చారు.
అప్పటిలోగా స్పందించకపోతే కేసీఆర్, హరీష్‌రావుల బండారం బయట పెడతానని హెచ్చరికలు జారీ చేశారు. వారు ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశారో, ఢిల్లీలో అశోక హోటల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవిపీ రామచంద్రరావు నుండి ఎన్ని సూట్‌కేసులు తీసుకున్నారో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన సీడీలు, చెక్కుల జిరాక్స్‌లు తనవద్ద ఉన్నాయని వాటన్నింటినీ బయట పెడతానంటూ కేసీఆర్, హరీష్‌రావులకు సవాల్ విసిరారు.
దీంతో ఆ పార్టీలో అన్ని స్థాయిలో రఘునందన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీలోనే కాకుండా కేసీఆర్‌ను ఎప్పుడెప్పుడు దెబ్బతీద్దామా అని సమయం కోసం వేచిచూస్తున్న వారిలో కూడా ఈ అంశం టెన్షన్‌ను పుట్టిస్తోంది. అయితే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను హరీష్‌రావు మాత్రం ఖండించారు. తిరుపతిలో ఐదువేలు, పదివేలు చేబదులుగా తీసుకున్న మాట వాస్తవమే అయినా అది సాధారణ విషయంగా కొట్టిపారేశారు. మిగిలిన ఆరోపణలను కూడా తేలిగ్గానే ఖండించారు. మధ్యాహ్నం 12 గంటలకు రఘునందన్‌రావు విధించిన గడువు ముగుస్తుంది.
దీంతో ఆయన వెల్లడించే అంశాలపై, చూపించే ఆధారాలపై సర్వత్రా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తెరాసలో సైతం కొందరు నాయకులు రఘునందన్‌రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు పార్టీ నుండి సస్పెండ్ అయినవారు గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేశారని,
ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదంటూ కొట్టిపారేస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, రవీంద్ర నాయక్, కేసీఆర్ మేనల్లుడు ఉమేష్రావులు కేసీఆర్ కుటుంబంపై దాదాపుగా డబ్బు వసూళ్ళ ఆరోపణలే బలంగా చేశారు. డబ్బు సంపాదన ధ్యేయంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదంటూ కూడా ధ్వజమత్తారు.
ఇటీవల పార్టీ నుండి సస్పెండ్ అయిన హన్మకొండ మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి సైతం కేసీఆర్‌ను వసూల్రాజాగా అభివర్ణించారు. అయితే గతంలో వైఎస్ బ్రతికుండగా ఆయన ఆత్మగా వ్యవహరించిన కేవీపీ రామచందర్‌రావు అన్ని విషయాలు చక్కబెట్టేవారు. ఇది బహిరంగ రహస్యమే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more