పోలీసులు ముందుగా శ్రీశాంత్ పై కొన్ని రోజుల నుండి నిఘా పెట్టారు. సరైన ఆధారం కోసం వేట సాగించారు పోలీసులు. శ్రీశాంత్, చవాన్ బుక్కీ మిథానియాను కలవడానికి లోనికి వెళ్లారు. పోలీసులు బార్ వెలుపల నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఢిల్లీ పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్ సహాయం తీసుకున్నారు. శ్రీశాంత్, అతని ఇద్దరు సహచరుల ప్రతి కదలికపై పోలీసులు కన్నేసి ఉంచారు. స్టేడియం నుంచి బయటకు వెళ్లిన శ్రీశాంత్‌ను అనుసరించారు. పబ్‌లో అరగంట పాటు ఉండి అంకిత్ చవాన్ పబ్ నుంచి బయటకు వచ్చాడు.
ఓ పోలీసు బృందం అతన్ని అనుసరించింది. వారిపై కన్నేసిన పోలీసులు వారిని వెంటాడారు. అప్పటికి శ్రీశాంత్ పబ్‌లో మిథానియాతోనే ఉన్నాడు. గురువారం తెల్లవారు జామున ఒంటి గంటన్నర ప్రాంతంలో పబ్ నుంచి బయటకు వచ్చాడు. కారులో ఎక్కి డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. మిథానియా కూడా బయటకు వచ్చి మరో కారులో బయలుదేరాడు. వారిని పోలీసులు అనుసరించారు. మోతీ మహల్ వద్ద పోలీసులు శ్రీశాంత్ కారును అడ్డగించారు. కారులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వారిని పోలీసులు ప్రశ్నించారు. అయితే శ్రీశాంత్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు.
శ్రీశాంత్‌ను పోలీసులు అర్థరాత్రి వెంటాడి పట్టుకున్నారు. అర్థరాత్రికి ముందు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీశాంత్, చవాన్ బాంద్రా వెస్ట్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. ఈలోగా ఓ పోలీసు బృందం లింకింగ్ రోడ్డు వద్ద మిథానియాను అరెస్టు చేశారు. శ్రీశాంత్ జట్టు సహచరుడు చండిలను ట్రైడెంట్ హోటల్‌లో అరెస్టు చేశారు. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిల ఫిక్స్ చేసిన మూడు మ్యాచుల క్లిప్పింగ్‌లను పోలీసులు మీడియాకు చూపించిన విషయం తెలిసిందే.
క్రికెటర్లకు, బుక్కీలకు మధ్య జరిగిన సంభాషణలను కూడా పోలీసులు వెల్లడించారు. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ చేరుకోగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం శ్రీశాంత్ ను కావాలని ఎవరు ఇరికించారు. ముందుగా ఒక ప్లాన్ ప్రకారం పోలీసులతో కలిసిపోయి శ్రీశాంత్ ను పోలీసులకు పట్టించినట్లు క్రికెట్ అభిమానులు అంటున్నారు. శ్రీశాంత్ మాత్రం అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు కానీ, ఇలాంటి ఫిక్సింగ్ లు చెయ్యడని కొంతమంది ముంబాయి గర్ల్స్ అంటున్నారు. ఈ విషయంలో శ్రీశాంత్ చెబితే గానీ అసలు నిజాలు బయటకు రావాని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more