ఒక్కరు పోతే 50 మందిని తయారు చేస్తానని ప్రకటన చేసిన కొన్ని గంటలకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయే షాక్ న్యూస్ తగిలింది. కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి వచ్చిన చంద్రబాబు అనుకోని విధంగా షాకిచ్చారు మరో సీనియర్ నాయకుడు. కడియం శ్రీహరి అన్న మాటలు నిజమే అనే విధంగా టిడిపి రాజకీయాలు ఉన్నాయి. తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు.
పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన కడియం శ్రీహరిని తప్పు పట్టే సాకుతో చంద్రబాబును లేఖను తప్పు పడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టంత లేదని ఆయన ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లోనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై తాను అలిగితే తనను బుజ్జగించింది కూడా కడియం శ్రీహరేనని ఆయన అన్నారు.
కడియం శ్రీహరిని లక్ష్యం చేసే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ మాటలు చెప్పారా, తన వ్యూహంలో భాగంగానే ఆ విషయం చెప్పారా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకున్న తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వం దృష్టి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి, కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రోజే ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారంటూ పుకార్లు వినిపించాయి.
అయితే తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎర్రబెల్లి పై బాలయ్య ప్రభావం చూపించదని సీనియర్ టీడీపీ నాయకులు అంటున్నారు. పాదయాత్ర పూర్తి చేసి వచ్చి చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఎర్రబెల్లి మాటలకు అర్థాలు మరోల ఉన్నాయని అంటున్నారు. కడియం శ్రీహరి చెప్పినట్లు త్వరలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లోకి వస్తాడని మీడియా చేసిన ప్రకటనలు నిజం అయ్యేలా ఉన్నాయని తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. ఏమైన ఎర్రబెల్లి వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా సమాధానం చెబుతాడో చూడాలి. అయితే టీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు మీద విమర్శలు చెయ్యటానికి ఒక ఆయధం దొరికినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more