మీడియా, మైకు, కనిపిస్తే.. చాలు కొంత మందికి నోరు జారిపోతుంది. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకరు. ప్రతిపక్ష నాయకులపై రాక్షస భాషను ఉపయోగించటంలో కేసిఆర్ ముందుంటారు. ఆయన మాట్లాడే బూతులకు నవ్వుకునే నాయకులు ఉన్నారు. శభాష్ అంటూ చాటుగా ఎంకరేజ్ చేసే అభిమానులు కేసిఆర్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన నోరు జారుడు ఎక్కువుగా ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఒక్క కేసిఆరే కాదు.. ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఎక్కువుగా ఇమేజ్ సంపాదించుకున్న నాయకుడు కేసిఆర్ ఒక్కరే. అయిన అన్నీ రోజులు కలిసిరావు. అందరు రాజకీయ నాయకులు మాట్లాడే బూతు వింటూ , మనకెందుకులే అని సరిపెట్టుకోని వెళ్లే రోజులు ఇవి.
అయితే ఒక రామారావు అనే వ్యక్తి మాత్రం ఇలాంటి బూతు మాట్లాడే నాయకులపై గట్టి చర్యల తీసుకోవాలనే ఉద్దేశంతో మొదటి అడుగు వేయటం జరిగింది. మొదటిగా కేసిఆర్ పై రామాబాణం ప్రయోగంచినట్లు న్యాయవాది రామారావు చెబుతున్నారు. జనవరి నెలలో జరిగిన టీ-జేఏసీ ‘సమరదీక్ష ’లో కేసిఆర్ , ప్రధాని మన్మోహన్ సింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటెండర్ కు ఉన్న జ్నానం ప్రధానికి లేదని విరుచుకుపడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పట్ల కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రామారావు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కోర్టు కెసిఆర్‌పై కేసును నమోదు చేయాలని ఆదేశించింది. తెలుగు దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా రామారావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అతను డిజిపి వద్దకు వెళ్లారు. విచారించాలని డిజిపి జిల్లా పోలీసులను ఆదేశించారు. కేసు ముందుకు కదలక పోవడంతో అతను జిల్లా కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసిఆర్ పై ఐపిసి 420, 504, 505, 506, 124ఎ, 120 సెక్షన్ ల కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కేసిఆర్ పై కేసు పెట్టిన రామారావు పై తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన రఘనందన్ రావు హస్తాం ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more