రాజకీయల్లో బిజీగా ఉన్న కేంద్రమంత్రి చిరంజీవి ‘కొత్త జంట’ కోసం కొంచెం సమయం కేటాయించారు. మెగా కుటుంబం నుండి అల్లు గారి అబ్బాయి ‘గౌరవం’ అనే తెలుగు సినిమాతో వెండితెర ప్రవేశం చేసిన నటుడు అల్లు శిరీష్ . ఆ గౌరవం అల్లు వారికి అంతగా కలిసి రాలేదు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త జంట'. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిరీష్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కెమెరా స్విచాన్ చేసారు. మెగా ఫ్యామిలీ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. కొత్త జంట దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ తో నాకు 15 సంవత్సరాల అనుంబంధం ఉంది. ఈ సంస్థలో చెయాలని ఎందరో కలలు కంటూ ఉంటారు. కానీ నాకు మూడు సినిమాకే ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని మారుతి చెప్పారు. చిన్నప్పటి నుండి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. నా మూడో సినిమాకి మెగా స్టార్ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు మారుతి సంబరపడి పోయారు.
అసలు కొత్త జంట కథ ఏమిటంటే ఇద్దరు ప్రేమికుల సెల్పిష్ గా ఉండే వారు చివరకి ఏమయ్యారు? స్వార్థం అనేది ఎదగడానికి పనికి రావాలి కానీ, స్వార్థంతోనే పైకి రాకూడదనే కథ. దర్శకుడు మారుతి చెప్పారు. అయితే హ్యాట్రిక్ కోసం మారుతి మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ.. బనీ వాసు నాకు 12 సంవత్సరాల నుండి తెలుసు. అంతేకాకుండా సొంత బ్యానర్ పై రెండో సినిమా చెయ్యటం చాలా ఆనందంగా ఉందని శిరీష్ చెప్పారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజ్, నిర్మాత బండ్ల గణేష్, నటుడు నాగబాబు, సాయిదర్మ తేజ్, అల్లు అర్జున్ తదితరులు రావటంతో అక్కడ అంత మెగా సందడి గా మారిపోయింది. ‘కొత్త జంటకు ’ కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more