ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారమిక్కడ టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరగనుంది. రెండు దేశాల అభిమానుల మనో భావాలకు సంబంధించింది. క్రికెట్ చరిత్రలో ఇండియా-పాకిస్థాన్ జట్టు ఎన్నోసార్లు తలపడి ఉండొచ్చు. అయినా ప్రతి మ్యాచ్ కొత్తదే. ఈ మ్యాచ్ కోసం ఏప్రిల్‌లోనే టిక్కెట్లు అమ్ముడుపోయాయంటే అభిమానులు ఈ పోరు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భావోద్వేగాలు, మద్దతు దారుల కేరింతల మధ్య ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ చివరికి ఫలితం తేలేది.. మైదానంలో క్రికెటర్లు ఆడే తీరుని బట్టే. అంతేకాదు.. ఇండియా-పాకిస్థాన్ జట్లు ఎప్పుడు తలపడినా వారి నైపుణ్యానికి, మానసిక స్థితికి అగ్ని పరీక్షగా నిలుస్తోంది. పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో ప్రమాదకరంగా మారే అవకాశముంది. మరోవైపు టీమిండియా పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇప్పటికే సెమీస్‌లో ప్రవేశించింది కాబట్టి.. ఆ జట్టు కూడా తిరగబడే అవకాశముంది. దీన్ని బట్టి చూస్తే.. ఇరు జట్లూ తమ దేశ ప్రజలు, అభిమానుల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగనున్నాయి. పాకిస్థాన్‌పై పరుగుల వరద పారిస్తే... భారత్‌లో క్రికెట్ కెరీర్ వాయు వేగంతో దూసుకుపోతుంది. ఇదేమీ నానుడి కాకపోయినా... చరిత్ర చెబుతున్న సత్యం. సచిన్ నుంచి కోహ్లి వరకూ... దాయాదిపై దమ్ము చూపినోళ్లే హీరోలయ్యారు. ఇప్పుడు భారత జట్టులోని యువ ఆటగాళ్లను ఊరిస్తున్న అంశం ఇదే. ఈ మ్యాచ్ ద్వారా హీరో అయ్యేది ఎవరు..?
భారత్ లక్షం..166
పాకిస్థాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ కు 40 ఓవర్లకు కుదించారు. అయితే భారత్ లక్ష్యం 166 పరుగులు చెయ్యాలి.
తొమ్మిదో వికెట్
159 పరుగుల వద్ద జునైద్ ఖాన్ రనౌట్ అయ్యాడు.
వెనువెంటనే రెండు వికెట్లు
139 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ (17) జడేజా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రియాజ్ అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 35 ఓవర్లు మగిసేసరికి పాకిస్థాన్ ఏడు వికెట్లు నష్టానికి 141 పరుగులు చేసింది.
ఐదో వికెట్
షఫిక్ (41) ఇషాంత్ శర్మ భైలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 32 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ అయిదు వికెట్లు నష్టానికి 136 పరుగులతో ఆడుతోంది.
నాలుగో వికెట్
పాకిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. మిస్బా ఉల్ హక్ (22) జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు, 27 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 111 పరుగులతో ఆడుతుంది.
ఓవర్లకు కుదింపు
వర్షం పడుతున్న కారణంగా భారత్ ఫాక్ హ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ పరుగులు 88 చేసింది. 22 ఓవర్లు ముగిచాయి. ముగ్గురు ఆటగాళ్లు ఔట్ అయ్యారు.
ఆగిన మ్యాచ్
మరో సారి మ్యాచ్ ఆగిపోయింది. మళ్లీ వర్షం అడ్డుపడింది. 12 ఓవర్లు ముగిసన తరవాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. మళ్ళీ 19 ఓవర్లు వరకు కొనసాగింది. అప్పటికే పాకిస్థాన్ 19 ఓవర్లోలో మూడు వికెట్లు కోల్పోయి . 70 పరుగులు చేసింది.
56 పరుగులకే మూడు వికెట్లు
పాకిస్థాన్ కష్టాల్లో పడింది. 51 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. మరళ వెంటనే 56 పరుగుల వద్ద మూడు వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కమ్రాన్ అక్మల్ ను అశ్విన్ పెవిలియన్ కు చేర్చాడు.
భారత్ -పాక్ మ్యాచ్ కు అంతరాయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ , పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లీగ్ మ్యాచ్ కు వరుణు దేవుడు అంతరాయం కలిగించాడు. కొద్ది నిమిషాలు పాటు మ్యాచ్ ను వర్షం కారణంగా నిలిపివేశారు. అయితే ఇప్పటికి పాకిస్థాన్ 12 ఓవర్లలో పరుగుల 50 చేసి, ఒక వికెట్ కోల్పోయింది. కమ్రాన్ అక్మల్ (20), హఫీజ్ (27) క్రీజలో ఉన్నారు..
పాకిస్థాన్ పరుగులు
50/1 .. 12 ఓవర్లు ..
పాకిస్థాన్ పరుగులు
26/1 .. ఆరు ఓవర్లు .. నాలుగు బంతులు
పరుగులు
7/1
తొలివికెట్
తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్. నాలుగు పరుగుల వద్ద జంషేడ్ ఔట్
టాస్ గెలిచిన భారత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మద్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ గెలచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు .
మధ్యాహ్నం గం. 3 నుంచి
చాంపియన్స్ ట్రోఫీలో హై వోల్టేజ్ పోరు
భారత్ బలం బ్యాటింగ్
టోర్నీలో ధోనిసేన బ్యాటింగ్ బలంతోనే విజయాలు సాధిస్తోంది. ఈ మధ్య కాలంలో యువ ఆటగాళ్ల సమష్టితత్వం ముందు ప్రపంచ స్థాయి బౌలర్లు కూడా బెంబేలెత్తుతున్నారు. ఓపెనర్లలో శిఖర్ ధావన్‌కు రోహిత్ శర్మ చక్కని సహకారం అందిస్తుండటం భారత్‌కు శుభపరిణామం. కోహ్లి, రైనా క్రీజులో నిలబడితే దాయాది బౌలర్లకు కష్టాలు తప్పవు. చివర్లో మెరుపు హిట్టింగ్ చేసేందుకు ధోని, జడేజా సిద్ధంగా ఉన్నారు.
పాక్ ఆయుధం బౌలింగ్
అటు పేస్, ఇటు స్పిన్‌లోనూ మిస్బాసేన బలంగా ఉంది. కానీ బ్యాటింగ్‌లో తడబడుతోంది. విండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల్లో బౌలర్లు ఆకట్టుకున్నా.. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఓటమిపాలైంది. నాసిర్ జంషేద్, మిస్బా మినహా మిగతా వారు విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది.
పిచ్
టోర్నీలో ఈ మైదానంలో కాస్త తక్కువ స్కోర్లు నమోదవుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్వింగ్ బౌలర్లు కీలకం కావచ్చు.
ఇండియా, పాకిస్థాన్ జట్ల వివరాలు
టీమిండియా: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, మురళీ విజయ్, వినయ్ కుమార్, ఉమేష్ యాదవ్.
పాకిస్థాన్: మిస్బా-ఉల్-హక్ (కెప్టెన్), నాసిర్ జమ్‌షెడ్, మహ్మద్ హఫీజ్, ఇమ్రాన్ ఫర్మాత్, కమ్రన్ అక్మల్, షోయబ్ మాలిక్, అసద్ షఫీక్, సయీద్ అజ్మల్, జునైద్ ఖాన్, మహ్మద్ ఇర్ఫాన్, అసద్ అలీ, వాహబ్ రియాజ్, ఉమెర్ అమీన్, అబ్దుల్ రెహమాన్, ఎహసాన్ ఆదిల్.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more