టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావుకు భూమి కష్టాలు వచ్చాయి. ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా 'సినీమ్యాక్స్' ను నిర్మించాడు. దీంతో ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. భూమిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఇన్నాళ్ళుగా ప్రభుత్వమే ప్రేక్షకుడి పాత్ర పోషించింది. ఏళ్ళు గడిచిపోయిన తరువాత సర్కారుకు మెలకువ రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి భూమి కావాలని 'రాఘవేంద్రరావు' ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనితో 1984లో అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. జూబ్లిహిల్స్ లో ఎడిటింగ్ అండ్ ఔట్ డోర్ యూనిట్ల నిర్మాణానికి గాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కృష్ణ మోహన్ రావు, సంగీత దర్శకుడు చక్రవర్తిలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. కానీ 1984-2006 వరకు ఈ భూమిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పనులు జరుగలేదు. భూమిని తీసుకున్న ఏడాది లోపు నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఏళ్ళు గడిచిపోయినా ఏ పని జరగలేదు. 2006 సంవత్సరంలో ఆ భూమిలో రాఘవేంద్రరావు నిర్మాణాలు ప్రారంభించారు. అనుకున్న ప్రకారం కాకుండా ఆ స్థలంలో మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మించారు. నిర్మాణాల తర్వాత వ్యాపార సంస్థలకు అద్దెకు ఇవ్వడం గమనార్హం. విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని ఆపాలని ఆదేశించింది.
ఇకపై ఎలాంటి నిర్మాణాలు కొనసాగించవద్దని సూచించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టులో కేసు నడుస్తుండగానే గుట్టు చప్పుడు కాకుండా థియేటర్లు, కేఫ్ లు నిర్మించి లీజుకిచ్చాడు. ఇదే అంశంపై ప్రజాసంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్రమంగా నిర్మించిన సినీ మ్యాక్స్ ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దని వారించినా మల్టీప్లెక్స్ నిర్మించడంపై జిల్లా కలెక్టర్ సినీమాక్స్ నిర్వహకులకు నోటీసులులిచ్చింది. వెంటనే రాఘవేంద్రరావుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవాలని సమాచార, ప్రజాసంఘాల శాఖకు కూడా ఓ నివేదిక కూడా అందజేసింది. కలెక్టర్ ఆదేశంతో సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి సమాచారశాఖ విజ్ఞప్తి చేసింది. ఇన్నేళ్ళు నిద్రలో ఉన్న మేల్కొని భూమిని వెనక్కు తీసుకునే పనిలో పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more