పల్లెల్లో రాజకీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' కీలక పాత్ర పోషించనుంది. ఈ నియమావళి పరిధిలోకి రాష్ట్ర ముఖ్య మంత్రితో పాటు మంత్రులు, అధికారులు, సర్పంచ్‌లుగా పోటీ చేసే అభ్యర్థులు, వార్డు పోటీదారులు వస్తారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎవరైనా క్రిమినల్ కేసులు ఎదుర్కోవలసిందే. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలే అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో 'కోడ్' తన ప్రతాపాన్ని చూపుతున్న విష యం తెలిసిందే. పేరుకి పల్లెల్లో జరిగే ఎన్నికలే అయినా కోడ్ మాత్రం పదునుగా ఉంటుంది. వీసమెత్తు కోడ్ ఉల్లంఘన జరిగినా క్రిమినల్ కేసులు తప్పవని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరిస్తున్నారు.
1అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రజలను, ఓటర్లను ప్రలోభ పెట్టేవిధంగా హామీలు, ప్రకటనలు చేయరాదని నియమావళిలో పేర్కొ న్నారు. మంత్రులు ఎన్నికల సందర్భంగా చేపట్టే పర్యటనలతో అధికారిక కార్యక్రమాలను జోడించి ఓటర్లను ప్రలోభ పెట్టే పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఇలాంటి పర్యటనల్లో అధికారులు ఎలాంటి సందర్భంలోనూ పాల్గొనరాదని నిబంధన విధించింది.
2ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కాలంలో ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రకటించరాదు. అంతేకాకుండా ఫండ్స్ కూడా విడుదల చేయరాదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి హామీలను ఇవ్వరాదు. కొత్త పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పోలింగ్ బూత్‌ల్లోకి నేరుగా వెళ్ళరాదు. పోలింగ్ బూత్ ల్లోకి వెళ్ళేందుకు అనుమతి కలిగిన వారు మాత్రమే అందు లోకి అనుమతించబడతారు. అలాంటి వారు బూత్‌ల్లోకి వెళుతున్నప్పడు వారి వెంట ఉండే సెక్యూరిటి మెన్ లోపలకు వెళ్ళరాదు. అలా సెక్యూరిటీతో లోపల ప్రవేశించడం వలన అందులో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే విధానం ఎన్నికల లెక్కింపు కేంద్రంలోకి వెళ్ళే విషయంలోనూ వర్తించే విధంగా నిబంధనలను రూపొందించారు.
3.అధికారమును ఉపయోగించుకుని అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేసే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారంలో వినియోగించరాదు. లోకల్ బాడీలకు సంబంధించిన వాహనాలను మంత్రులు, సభ్యులు ఎన్నికల సందర్భంగా వినియోగించరాదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నకాలంలో మంత్రులు చేపట్టే పర్యటన లను ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే టూర్లుగానే భావించాలి. అందులో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పాల్గొనేం దుకు వీలులేదు.
4. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి పక్షం వహించకుండా పక్షపాత రహితంగా వ్యవహరించాలి. అంతే కాకుండా పోటీలో ఉండే అభ్యర్థులకు వ్యతిరేకంగా, అనుకూ లంగా ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. ఎన్నికల సంద ర్భంగా ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల ప్రచార కార్యా లయాలుగా ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదు. అన్ని పార్టీల వారికి నిబంధనల మేరకు వాటిని వినియోగించు కునేం దుకు అనుమతించాలి. ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందిన అభ్యర్థులు బాధ్యులుగా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల భవనాలను, అందులో పనిచేసే ఉద్యోగులను తనకు అను కూలంగా వినియోగించే విధానాన్ని అధికారులు నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా నిర్వహించే అన్ని రకాల సభలు ఎన్నికల ప్రచార సభలుగానే భావించాలి. అందులో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, లేదా ప్రభుత్వ నిధులను అందుకు ఖర్చుచేయడం లాంటివి జరగకూడదు.
5. ఎన్నికలల్లో పోటీ అభ్యర్థులు వారికి నిర్ణయించిన వ్యయ పరిమితికి లోబడే ఖర్చుచేయాలి. ఈ విషయాలన్ని ఎన్నికల పరిశీలకులుగా నియమించబడిన అధికారులు ఎప్పటిక ప్పుడు విషయాలను నమోదు చేసుకుని పర్యవేక్షించాలి. ప్రతి అభ్యర్థి ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపుగా ఎన్నిక వ్యయానికి సంబంధించిన వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించాలి. అభ్యర్థి ఎన్నికలలో రోజూ అయ్యే వ్యయాన్ని అధికారులు ఉచితంగా అందించిన రికార్డుల్లో నమోదు చేయాలి.
6. అభ్యర్థులు ఇళ్ళ యజమానుల అనుమతితో బ్యానర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. ఎన్నికలకు 48 గంటల ముందుగా అన్ని రకాల ప్రచారాలు నిలిపేయాలి. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై ఎన్నికల సంఘం అధికారుల సూచనతో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more