అద్రుష్టం అరంగుళం దూరంలోకి వచ్చింది, ఇక అందుకోవటమే ఆలస్యం అన్నట్లుగా తెలంగాణ రాజకీయ జేఏపీ చైర్మన్ కోదండరామ్ పరిస్థితి ఢిల్లీలో ఉంది. తెలంగాణ పేరుతో ఉద్యమం నడుపుతున్న కోదండరామ్ కు తెలంగాణ రాష్ట్రం సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మద్య విబేదాలే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయినాయి. గత మూడు రోజుల నుండి కోదండరామ్ ఢిల్లీ నాయకులు ప్రత్యేక తెలంగాణ వాదం వినిపిస్తున్నారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ (అమ్మ) దర్శనం జరిగే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. అమ్మ దర్శనం ఒక్కసారితో అయిపోదు.. తెలంగాణ విషయంలో కనీసం నాలుగైదు సార్లు అమ్మ దర్శనం కలిగే అవకాశాలు ఉన్నాయాని ఢిల్లీ నాయకులు కోదండరామ్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకేవేళ అమ్మతో జరిపిన చర్చలు సఫలం అయితే, తెలంగాణ ప్రజలకు కోదండరామ్ దేవుడుగా మారిపోతాడు.
కేసిఆర్ ను ఒక దిష్టిబొమ్మగా మార్చేస్తారని జేఏసీ నేతలు అంటున్నారు. అయితే, అపాయింట్మెంట్ కోసం కోదండరామ్ సోనియాకు లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానం రాలేదు. నాలుగు పేజీలునన లేఖను ఫ్యాక్స్ , మెయిల్ ద్వారా కోదండరామ్ ఆమె కార్యాలయానికి పంపించారు. అయితే, ఆ లేఖకు ఏ విధమైన జవాబు కూడా రాలేదు. 'తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉన్నందున అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుసుకోవాలని నిర్ణయించామని, అన్ని పార్టీల నేతలతో ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నామని, మిమ్మల్ని కూడా కలుసుకోవాలనుకుంటున్నామని, అవకాశం ఇస్తే, కలిసి, తెలంగాణపై వివరిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. కోదండరామ్ సుడితిరిగే .. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఆశ్చర్యం లేదని తెలంగాణ జేఏసీ నేతలు అంటున్నారు. సోనియాగాంధీ కోదండరామ్ కు దర్శన భాగ్యం ఇస్తుందో లేదో చూడాలి. అమ్మ దర్శనం కోసం జేఏసీ కోదండరామ్ కోటి ఎదురుచూపులు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more