భారత జట్టు విదేశీ గడ్డ పై అడుగు పెడుతుందంటే... కాస్తంత ఆందోళనే. కానీ మొన్నటి వరకు ఇంగ్లాండులో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆట తీరును చూస్తే... ముక్కోణపు సిరీస్ ని ఈజీగా కొడుతుందని అనుకున్నారు. అది గాక అందులో తలపడిన జట్లే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నారు. కానీ విండీస్ లో అడుగు పెట్టాక తెలిసింది మనోళ్ళకు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడి టైటిల్ సాధించడం కాదుకదా ఫైనల్ చేరితే గగనమే అనుకునే స్టేజికి వచ్చారు. దీంతో మిగిలిన రెండు లీగ్ మ్యాచ్ ల్లో గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై ఓ మేరకు బాగానే ఆడినా... శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం దారుణంగా చేతులెత్తేసింది. ఇటీవలి ఆటతీరుతో ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకున్న భారత్ హఠాత్తుగా సత్తా చూపలేని జట్టుగా మారింది. ఈ పరిస్థితుల్లో నేడు (శుక్రవారం) ఆతిథ్య వెస్టిండీస్‌తో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. భవిష్యత్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి తన శక్తిసామర్థ్యాలు ఎలాంటివో చాటుకోవాల్సి ఉంది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన లంక మ్యాచ్‌లో కూడా అతని ప్రణాళికలు ప్రభావం చూపలేకపోయాయి.
ఇలాంటి పరిస్థితిలో నేటి మ్యాచ్‌లో యువ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒక ఈ సిరీస్ లో జడేజా మినహా కింది స్థాయిలో ఎవరూ రాణించలేకపోతున్నారు. శిఖర్ ధావన్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఓపెనర్లు ఐదు ఓవర్లను మించి ఆడలేకపోయారు. కోహ్లి, కార్తీక్ కూడా విఫలమయ్యారు. ఓవరాల్‌గా బ్యాట్స్‌మెన్ పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరు చూపాల్సి ఉంది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి తన సొంత గడ్డలో తామే రారాజులం అని ధీమాగా ఉన్న విండీస్ జట్టు మంచి ఫాంలో ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ ఓడితే టోర్నీలో ఉండేందుకు ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముందుగా ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విండీస్ జట్టు ఐదు పాయింట్లతో ఉన్న శ్రీలంకను ఓడించాల్సి ఉంటుంది. అటు మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు లంకను బోనస్ పాయింట్ సహాయంతో ఓడించి రన్‌రేట్‌ను మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది. అలాగైతే ఇరు జట్లు ఐదు పాయింట్లతోనే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ ఆధారంగా భారత్ తుది పోరుకు అర్హత సాధిస్తుంది. చూద్దాం మనవాళ్ల సత్తా ఏంటో ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more