కలియుగ దైవం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి సాక్షిగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. శ్రీవారి సన్నిదిలో సత్తిబాబు సమైక్యవాదం వినిపించారు. బొత్స సత్యనారాయణ తన మనసులో మాటను బయటపెట్టారు. సత్తిబాబు మనసులో మాట విన్న కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ నాయకులు, సమైక్యాంద్ర నాయకులు షాక్ తిన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సత్తిబాబు క్లారిటీగా సుత్తిలేకుండా రెండు ముక్కల్లో తేల్చి చెప్పాడు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలనేది సత్తిబాబు కోరిక. అయితే గతంలో తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? అంటూ ప్రత్యేక వాదానికి మద్దతు పలికిన సత్తిబాబు, నోట సమైక్య వాదం వినిపించింది. అప్పుడు అలా చెప్పినందుకే సత్తిబాబుకు పీసీసీ ఛీఫ్ పదవి వరించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సత్తిబాబులో వచ్చిన సమైక్య రాగంతో సమైక్య వాదులు ఆనందంగా ఉన్నారు.
గతంలో తెలంగాణ కు మద్దతు తెలిపినందుకు తెలంగాణ నాయకులు సత్తిబాబుకు జై అన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రాష్ట్ర విభజన పై తాడో పేడో .. అంటూ ప్రచారం జరుగుతుండగా, సత్తిబాబు సరికొత్త మెలిక పెట్టేలా కనిప్పిస్తోంది. రాష్ట్ర విభజన పై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకునేదాక, రాష్ట్రం కలిసే వుండాలని సత్తిబాబు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రోడ్ మ్యాప్ రెఢీ చేసే విషయంలో ఒక మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్ ను మన రాజకీయ నాయకులు ఎవరు గుర్తించలేదు. దిగ్గీరాజు వేసిన మాయ మ్యాప్ లో ముగ్గురు నాయకులు చిక్కుకున్నారు. రోడ్ మ్యాప్ రెడీ చెయ్యండని, మూడు ప్రాంతాల ముఖ్య నాయకులకు దిగ్గీరాజు సూచించారు. ఒకరు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాయల్ సీమకు చెందిన వ్యక్తి, రెండు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇక మూడో వ్యక్తి ఆంద్రాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.
ఈ ముగ్గురు కలియకలో.. రోడ్ మ్యాప్ ను విడివిడిగా రెడీ చెయ్యటం జరిగింది. ఇక్కడే తెలిసి పోతుంది రాష్ట్రం విభజన జరగదని. (ఇదేమన్నా బ్రోక్ బాండ్ త్రీరోజ్స్ టీ అనుకున్నారా.., రంగు , రుచి, చిక్కదనం కలిసి , కమ్మనీ టీ రెడీ అవ్వటానికి ) కానీ ఈ మూడు ప్రాంతాల వ్యక్తులు కలిసి, రోడ్ మ్యాప్ రెడీ చేస్తే , రాష్ర్ట విభజన ఎలా జరుగుతుంది? అందుకే మన రాష్ట్రం పై దిగ్గీరాజు ఈ సూత్రాన్ని ఆప్లయ్ చేశాడని రాజకీయ నాయకులు అంటున్నారు. అంటే ఈ మూడు గుణాలు కలిగిన వ్యక్తులు ఎప్పటికి కలిసే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ రోడ్ మ్యాప్ పేరుతో డ్రామా ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సత్తిబాబు కూడా ఆ దైర్యంతోనే సమైక్యరాగం పాడినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సమైక్యంద్రా కోసం సత్తిబాబు తన పదవిని వదులుకోవటానికి సిద్దమైనట్లు సమాచారం. మొత్తం మీద సత్తిబాబు పాడిన సమైక్య రాగం దెబ్బకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుండె జారిగల్లంతైయిందే... అంటూ పాడుకోవాల్సిందే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సత్తిబాబు పై ఎలాంటి కామెంట్ చేస్తోరో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more