రాష్ట్ర ముఖ్య నాయకులైన ఈ ముగ్గురు చూపు దాని మీదే ఉంది. మరో రెండు రోజుల్లో ఈ ముగ్గురిలో ఉన్న టెన్షన్ మొత్తం పోతుంది. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోనుందనే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎం కిరణ్ కుమార్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపిన మరుక్షణం నుంచే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. దిగ్విజయ్ వ్యాఖ్యలు ఇరు ప్రాంతాల నేతల్లో చలనం కలిగించాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల నేతలు తమ వ్యూహాలను రచించడంలోనూ, సమావేశాలను నిర్వహించడంలోనూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ జూలై 12 తేదిన రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం తీసుకోనుందని దిగ్విజయ్ సింగ్ మారోమారు ప్రకటన చేయడంతో రాష్ట్ర రాజధానిలో మరింత హడావిడి మొదలైంది.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా దిగ్విజయ్ సింగ్ ఫోన్ లో మాట్లాడి శుక్రవారం నాటికి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుని రావాలంటూ చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సమావేశానికి బొత్స, దామోదర రాజనర్సింహలు కూడా హాజరుకావాలంటూ దిగ్విజయ్ ఆదేశించారు. రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు ఇప్పటికే ముగ్గురు అగ్రనేతలు ఆయా ప్రాంతాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ లు ఆరోజన జరిగే కేబినేట్ సమావేశాన్ని కూడా వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. ఇక ప్రకటన చేయడం ఆలస్యం' అని తాజాగా ముఖ్యమంత్రిని కలిసిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే వార్తల మధ్య ఆంధ్ర, రాయలసీమ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన పలువురు నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. క్షణ క్షణం ఉత్కంఠను రేపుతున్న అనేక ఊహాగానాలు, మీడియా కథనాలకు తెర పడాలంటే జూలై 12న జరిగే కోర్ కమిటీ సమావేశం వరకు ఆగాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more