ప్రణబ్ ముఖర్జీ ప్రధమ పౌరుడిగా వచ్చి ఇప్పటికి ఏడాది కాలమైంది. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు పలు కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొంటూ గడపటానికి నిశ్చయించుకున్నారు.
ముందుగా ఆయన రాష్ట్రపతి భవన్ లోని ప్రణబ్ ముఖర్జీ పబ్లిక్ లైబ్రరీ ఉద్ఘాటన చేస్తారు. రాష్ట్రపతి ఎస్టేట్ లో 8000 కుటుంబాలున్నాయి. వారి కోసం సంపూర్ణంగా ఎయిర్ కండిషన్ చెయ్యబడ్డ లైబ్రరీలో అన్ని వయసుల వారికీ పనికివచ్చే వార్తా పత్రికలు, మేగజైన్లు, వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. చిన్నపిల్లలలో చదువుకునే ఆసక్తిని పెంపొందించటం కోసం బాలల సెక్షన్ ని విడిగా ఏర్పాటు చేసారు. ఆ తర్వత ఎస్టేట్ లోని డా.రాజేంద్రప్రసాద్ సర్పోదయ విద్యాలయ కోసం క్రీడలకు కావలసిన అన్నిరకాల క్రీడా వస్తువులతో కూడిన క్రికెట్ స్టేడియం, క్రికెట్ మైదానాన్ని ప్రారంభిస్తారు.
తర్వాత పద్మశ్రీ గ్రహీత 89 సంవత్సరాల రామ్ సుతార్ చెక్కిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అరుదైన ఫొటోలను డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆధునికంగా రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుని ఉపయోగించి రాష్ట్రపతి అన్ని రాష్ట్ర గవర్నర్లతోనూ వీడియో చర్చలను చేస్తారు. రాత్రికి కేంద్ర మంత్రి వర్గ సభ్యులకు విందునిస్తారు.
ఇవీ ఈరోజు రాష్ట్రపతి ముఖ్య కార్యక్రమాలు.
సంవత్సరకాలం రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చేసిన పనులలో ముఖ్యమైనది, ఎన్నో సంవత్సరాలుగా పక్కన పెట్టి వున్న క్షమాభిక్ష అర్జీలను పరిశీలించటం. 26.11 హింసకు కారకుడైన అజ్మల్ కసబ్, పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్ గురుల క్షమాభిక్షలను తిరస్కరించారు.
బ్రిటిష్ పాలన అంతరించి ఇంతకాలమైనా ఇంకా కోర్టులలో యువర్ ఆనర్ అని సంబోధించటం పోలేదు. కానీ ప్రధమ పౌరుడిగా అత్యున్నత కార్యాలయానికి ముఖ్యుడైన రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ మాత్రం తనని హిజ్ ఎక్సలెన్సీ అని సంబోధించటాన్ని తీసివేసారు. రాష్ట్రపతి భవన్ లో సీదా సాదాగా అందరితో కలిసి మాట్లాడటమే ఆయనకు అలవాటు. ప్రోటోకాల్స్, అనవసరమైన భద్రతా ఏర్పాట్లను ఆయన తీసివేయించారు. ఆయన అక్కడ అందరితో మాట్లాడే విధానంలో ఆయన అందరితో కలిసిపోవటాన్నిఎంతగా ఇష్టపడతారో అర్థమౌతుంది.
సంవత్సరం క్రితం తన నివాసంగా మారిన రాష్ట్రపతి భవన్ ని ప్రణబ్ ముఖర్జీ చక్కగా తీర్చి దిద్దారు. పాత యాంటిక్ ఫర్నిచర్, మ్యూజియమ్, పాత పుస్తకాలలాంటి వాటి మీద శ్రద్ధ చూపి వాటిని భద్రపరచేట్టుగా చేసారు. రాష్ట్రపతి భవనానికి అవసరమైన చోట మరమ్మత్తులు చేయించి వాడకుండా ఉంచి దర్బార్ హాల్ లాంటి ప్రదేశాలను తిరిగి ఉపయోగించే విధంగా తయారు చేయించారు.
దేశంలో పర్యటించిన రాష్ట్రపతి తన సంవత్సర కాలంలో విదేశీ పర్యటనలను రెండిటికే పరిమితం చేసారు.
78 సంవత్సరాల రాష్ట్రపతి సంవత్సరకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more