2014 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ యూపీఏ -2 ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం గత కొన్నేళ్ళుగా నాన్చుతూ వస్తున్న తెలంగాణ అంశాన్ని ఇక అటో ఇటో తేల్చేసే పనిలో పడి మొన్న కోర్ కమిటీ భేటీ నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. రేపు నిర్వహించబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ పై అధికారిక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహలను ఢిల్లీకి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ సమావేశానికి మందే వీరి ముగ్గురి అభిప్రాయాలు మరోసారి సేకరించి వాటి పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావించే వీరిని ఢిల్లికి పిలిచినట్లు సమాచారం . కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎదురుతిరిగే అవకాశం ఉండదని, అందువల్ల పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి గట్టిగా చెప్పేందుకే ఢిల్లీకి పిలిపిస్తున్నారని సమాచారం. సీఎం కిరణ్ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ, విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కు అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చేందుకు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ సమైక్యవాదం వినిపిస్తున్న నేతలందరిని కూడా సముదాయించాలని చెప్పేందుకు పిలిచినట్లు సమాచారం.
ఇంత వరకు బాగానే ఉన్నా... ముఖ్యమంత్రి కిరణ్ కి అస్సలు తలనొప్పులు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. కోర్ కమిటీలో సమైక్యవాదాన్ని వినిపించి ఆంధ్ర నేతల మన్ననలు పొందిన కిరణ్, ఇప్పుడు అధిష్టానం పిలిచి విభజనకు సహకరించాల్సిందే అని గట్టిగా హెచ్చరించేందుకు సిద్ధం అవుతుండటం, ఇక సీమాంధ్ర నేతలు విభజిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు ఇవ్వడంతో కిరణ్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే తన పదవికి గండం, మరోవైపు అధిష్టానం మాటను తిరస్కరిస్తే తనకు ముప్పు వస్తుందని కిరణ్ లోలోపల మదన పడుతున్నాడు. మొన్న కోర్ కమిటీ భేటీ తరువాత కిరణ్ పై సమైక్యవాది ముద్ర పడటంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది సన్నిహిత మంత్రులు కూడా ఇప్పుడు దూరం అవ్వడంతో కిరణ్ కాస్త నిరుత్సాహంతో ఉన్నాడని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఇస్తే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అన్న పేరు వస్తుందన్న కలత ఆయనలో ఉందని సచివాలయ ఉన్నత సీనియర్ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఇటు అధిష్టానంతో, అటు సన్నిహితులతో, సీమాంధ్ర నాయకులతో కిరణ్ పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ’లా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more