రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా వైఎస్సార్‌సి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మినహా మిగిలిన 16మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆళ్లగఢ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను ఫార్మాట్లో గురువారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తోందని, ఓట్లు, సీట్లు కోసం కుటిల రాజకీయాలను అవలంబిస్తోందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వైకాపా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
విభజనపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే సీమాంధ్ర వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమే అని ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేసి ఉండవచ్చని వైకాపా నాయకులు చెప్తున్నారు. ఎమ్మెల్యేల రాజీనామా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఖంగుతిన్న వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణలో ఆశలు వదులుకుని సీమాంధ్రలో పట్టుకోసమే ఈ అస్త్రాన్ని ప్రయోగించిందనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. తెలంగాణపై తాడోపేడో తేలేవరకు వేచివేచి ఉండేకంటే సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామా చేయకముందే తాము రాజీనామా చేస్తే స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించటంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి విజయం సాధించవచ్చని ఆ పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. శనివారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సిడబ్ల్యుసి సమావేశపు తేదీని నిర్ణయించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణపై మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో స్పష్టతలేదు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న సమయంలో లోక్‌సభలో సమైక్యవాణి వినిపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి తటస్థ వైఖరిని అవలంబించారు. తాజా పరిణామాలతో ఆ పార్టీ సమైక్యాంధ్రకే మొగ్గుచూపుతుందనేది తేలిపోయింది. ఇదిలా ఉంటే.. సీమాంద్ర ఎమ్మెల్యేల రాజీనామాలను వైకాపా లోని తెలంగాణ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ అంశంపై పార్టీ అధినాయకత్వంతో తేల్చుకునేందుకు ఈరోజు ఆ ప్రాంత ముఖ్య నేతలు పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. అయితే ఈ రాజీనామాలకు ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మాత్రం దూరంగా ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more