తెలంగాణపై యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం తేదీ మారినట్లు తెలుస్తోంది. ఈ నెల 29వ తేదీకి బదులు 31వ తేదీన యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని సమాచారం. తెలంగాణపై చర్చించడానికి యుపిఎ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. కేంద్రం నుండి తెలుగు మీడియాకు సడన్ గా పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్ నివాసం నుంచి తెలుగు మీడియా ప్రతినిధులకు పిలుపు వచ్చింది. తెలంగాణపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముందని భావించిన మీడియా ప్రతినిధులు హడావుడిగా ఆజాద్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నాయకులు ఆజాద్ నివాసంలో ఉండడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. రాష్ట్ర విభజనపై సంప్రదింపులు పూర్తికావటంతో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆజాద్ ఏం చెబుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర విభజన విషయంలో ఇటీవలి వరకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేసిన ఆజాద్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాక అజాద్ రాయల తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయసేకరణ చేస్తున్నారని అంటున్నారు. దాని గురించి వివరణ ఇవ్వవచ్చన్న భావన కూడా వ్యక్తం అయింది. చివరికి అజాద్ ప్రెస్ మీట్ రద్దు కావడంతో మళ్ళీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more