రాష్ట్రం విభజన సెగ ఖాకీలకు ఎక్కింది. ఖాకీల సైతం రెండుగా విడిపోతున్నారు.రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా రెండుగా చీలిపోయి ఢిల్లీలో మకాం వేయగా, తాజాగా పోలీసు శాఖకూ విభజన వేడి తగిలింది. సీమ విభజనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళాలు (ఎపిఎస్‌పి) డీఐజీ మహ్మద్ ఎక్భాల్ సిద్ధిఖీ రాజీనామా చేశారు. క్రమశిక్షణను మారు పేరుగా నిలిచిన పోలీసు శాఖలో ఉన్నత స్థాయి అధికారిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేశారన్న వార్త ఆ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్భాల్ తన రాజీనామా లేఖలను డీజీపీ వి. దినేష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి పంపించారు. సీమను విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలిసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లా కౌకుంట్ల గ్రామానికి చెందిన ఎక్భాల్ ఎపిపిఎస్‌సి ద్వారా గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో డీఎస్‌పీగా చేరారు. ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబునాయుడు పని చేసిన సమయంలో ఆయనకు ప్రధాన భద్రతాధికారిగా సమర్థవంతంగా విధులను నిర్వహించారు. ఆ సమయంలోనే ఎక్బాల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అంచలంచెలుగా ఎదిగిన ఆయన 1999లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ నేతృత్వంలో పని చేసే టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీగా, డీసీపీగా కూడా ఆయన విధులను నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీగా కూడా ఆయన పని చేశారు. నెల రోజుల క్రితం డీఐజీగా పదోన్నతి పొందిన ఎక్బాల్‌ను ఎపిఎస్‌పి డీఐజీగా నియమించారు. 2018 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయితే ఇక్బాల్ రాజీనామాపై విచారణ జరిపిన అనంతరం కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more