ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రాష్ట్ర విభజన విషయంలో ఈ మాటలను ఖరాఖండిగా చెప్పారు- నేనా ఘోరంలో పాలుపంచుకోలేను అని.
ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది కానీ బయటపెట్టే ముందు వాటి ప్రభావం ఎలా ఉంటుందో బేరీజు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టాన్ని చేకూర్చే రాష్ట్ర విభజనలో తాను భాగస్వామిగా వ్యవహరించలేనని కిరణ్ కుమార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ కే కాకుండా ప్రధాన మంత్రికి, ఆఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా స్పష్టం చేసారు.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పట్టణాలలో ఎన్నికలు జరుగుతాయి. అంతవరకూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన మీద తమ నిర్ణయాన్ని ప్రకటించదనే తెలుస్తోంది.
కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్ళంరాజు, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరిలతో పాటు కె.బాపిరాజు, అనంత రామిరెడ్డి కూడా ఢిల్లీలో ప్రధాన మంత్రిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు.
తెలంగాణా అంశం ఎప్పటినుంచో నలుగుతూ వస్తోంది కాబట్టి ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి రాదులే అన్న ధీమాతో ఉన్న సీమాంధ్ర నాయకులు అధిష్టానం ఏది చెప్తే అదే మాకు శిరోధార్యం అని చెప్పిన వాళ్ళు, తెలంగాణా విషయంలో పావులు చకచకా కదులుతుండటంతో ఢిల్లీ లోనే మకాం వేసి ఆగ్రనాయకులను కలిసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే పరిస్థితి ఉండదన్న విషయాన్ని ఇప్పుడు స్పష్టం చెయ్యకపోతే పూర్తగా చెయిజారిపోతుందనే భయం సీమాంధ్ర నేతలలో కనిపిస్తోంది.
అన్నిటికీ బావే కానీ వంగచేలో కాదన్నట్టుగా, అధిష్టానానికి ఇంతకాలం మద్దతు పలుకుతూ వినయ విధేయతలను ప్రదర్శించినా, రాష్ట్ర విభజన అనేది రాజకీయ మనుగడకి ప్రతిబంధమౌతుందని, తమ మద్దతుదార్లు మద్దతుని ఉపసంహరించుకునే అవకాశం ఉందని భావించిన ముఖ్యమంత్రి ఈసారి మాత్రం తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. దయచేసి రాష్ట్ర విభజన మాట ఎత్తకండి ఫర్ గాడ్ సేక్ అని దిగ్విజయ్ సింగ్ తదితరులతో కిరణ కుమార్ తన మనసులోని మాటను ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా అతి స్పష్టంగా చెప్పటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more