కడప ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆస్తుల కేసులో జైల్లో ఉండటంతో పార్టీ లో ఇప్పుడు ముసలం నడుస్తుంది. పార్టీలోని నాయకులు రెండు ప్రాంతాలుగా విడిపోయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టారు. మాజీ మంత్రి కొండా సురేఖ తో సహా మరికొందరు నేతలు కె.కె.మహేంద్రరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు. మహేంద్రరెడ్డి అయితే పార్టీని వదలుతున్నట్లు ప్రకటించారు. పార్టీ గౌరవం కన్నా, తెలంగాణ ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని అన్నారు. తెలంగాణపై పార్టీ విధానం స్పష్టం చేయాలని కోరినా పార్టీ నాయకత్వం అందుకు సిద్దంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా, కొండా సురేఖ పార్టీని వదలడం మాత్రం బాధగానే ఉందని అంటున్నారు. సురేఖ చాలా కాలంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యంతో ఉంటున్నారు. వై.ఎస్.తొలిసారి కొండా సురేఖను గుర్తించి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే తను ముఖ్యమంత్రి అయ్యాక రెండో సారి మంత్రి పదవి కూడా ఇచ్చారు.
తద్వారా వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సురేఖ కూడా వై.ఎస్.కుటుంబం పట్ల అదే తరహాలో అబిమానం చాటుకుంటూ వచ్చారు. కాని ఈ మధ్యకాలంలో జగన్ జైలుకు వెళ్ళిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కొన్ని పొరపొచ్చాలు రావడం, తిరిగి సర్దుకోవడం జరిగినా, తెలంగాణ అంశంలో విబేధాలు రావడంతో పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి వచ్చింది. దీనిపై వైకాపా అదికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ మహేంద్రరెడ్డి, బాలకృష్ణారెడ్డి వంటివారు పార్టీని వదలినా నష్టం లేదని, కాని సురేఖ వెళ్ళే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. కానీ 16 మంది వైకాపా ఎమ్మెల్యే ఒక్కసారిగా రాజీనామాలు చెయ్యటం పై గట్టు ఏం మాట్లాడలేదు. కానీ తెలంగాణ నాయకుల్లో చైతన్యం తెచ్చింది మాత్రం ఈ 16 రాజీనామలే అని వైకాపా సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ పరిణామాలతో తెలంగాణలో వైకాపా పార్టీ మరింత బలహీనపడవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇలాగే కొనసాగితే.. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైకాపా పెద్దలు కూడా తెలంగాణ పై ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తోందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more