ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ నిర్మాతగా, దర్శకుడిగా అనుష్క ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ‘రాణి రుద్రమ ’ సినిమాను తెర కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ సెట్లతో సగానికి పైగా షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా లో మహేష్ బాబు ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాటల రికార్డింగ్ నిమిత్తం లండన్ వెళ్ళిన గుణ శేఖర్ అక్కడే షూటింగ్ లో ఉన్న మహేష్ ని కలిసి ‘ గోన గన్నారెడ్డి ’ పాత్ర చేయాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటించడం లేదని తేలిపోయింది. ఈ వార్తలను తన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. దీనికి కారణం మహేష్ బాబు బిజీ షెడ్యూలే కారణం అని చెప్పారు. ప్రస్తుతం సుకుమార్ సినిమాలో బిజీగా ఉన్న ప్రిన్స్ శీను వైట్ల ఆగడు సినిమా ఆగష్టులో సెట్స్ పైకి వెళుతుండటమే కాకుండా, కొరటాల శివ సినిమాలో కూడా కమీట్ కావడం వల్ల దీనికి డేట్లు ఇవ్వలేకపోయాడని అంటున్నారు. గతంలో మహేష్ కి సూపర్ హిట్ సినిమాలు అందించిన గుణశేఖర్ కే డేట్లు ఇవ్వక పోవడం పై వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు సినీ జనాలు. గుణ శేఖర్ ఒకప్పుడు మంచి సినిమాలే చేసినా రీసెంట్ సినిమాల ట్రాక్ రికార్డు చూసే ఈ పాత్రకు కమీట్ కాలేదని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ ఈ సినిమాలో లేడని మాత్రం తేలిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more