ఢిల్లీ వేదిక మీద తెలంగాణ పంచాయతీ తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణపై తన తుది నిర్ణయాన్ని వెలువరిస్తుందని చెబుతున్నారు. తొలుత నాలుగు గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం, ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది. దీంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఆంద్రప్రదేశ్ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
24.యూపీఏ ఎనిమిది రాజకీయపక్షాలున్నాయి
కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్ఎల్ డీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్(మణి), సిక్కిం డెమెక్రటిక్ ప్రంట్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమాక్రటిక్ ప్రంట్ లు యూపీఏలో భాగస్వమ్య పక్షాలుగా వున్నాయి. అయితే కాంగ్రెస్ తరపున సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్, ఎన్సీసీ తరుపున శరద్ పవర్ , ఆర్‌ఎల్‌డీ తరుపున అజిత్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి షరూఖ్ అబ్ధుల్లా , ఐయూఎంల్ నుంచి అహ్మద్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
23. ప్రారంభం..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది
22.అందరి చూపు ఆమె ఇంటిపై వైపు ….
ప్రధాని నివాసంలో యూపీఏ సమన్వం సంఘం సమావేశం ముగిసింది. ఇప్పుడిక సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగునుంది. యూపీఏ సమావేశంలో మిత్రపక్షాలకు కాంగ్రెస్ నిర్ణయాన్ని వివరించి వారి అభిప్రాయాల్ని తీసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ లు ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దాంతో అందరు ఉత్కంఠగా సోనియా గాంధీ ఇంటి వైపు ద్రుష్టి సారించారు.
21 ఏకగ్రీవం ఆమోదం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి యుపిఏ భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి యుపిఏ పక్షాల నేతలు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రతిపాదనను నేతలందరూ ఆమోదించారు.
20 కాసేపట్లో తెరలేవనుంది?
తెలంగాణ పై తుది నిర్ణయాన్ని వెలువరించటానికి మరి కాసేపట్లే తెరలేవనుంది. యూపీఏ సమన్వయ సమితి మరి కాసేపట్లో భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ అద్యక్షరాలు సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి షిండే, మరికొంతమంది సీనియర్లు పాల్గొంటారు. మిత్ర పక్షాలకు సమస్య క్రమాన్ని వివరించి ప్రస్తుతం ఏం నిర్ణయం తీసుకోబోతున్నది చెప్పి, దానిపై వారి అభిప్రాయాలను కోరనునున్నట్లు సమాచారం.
19 షిండే టీ-కబురు
తెలంగాణ అంశంపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు అని ఆయన అన్నారు. 1956 నుంచి తెలంగాణ సమస్య పెండింగ్ లో ఉందన్నారు.
18సుష్మాస్వరాజ్ ఆనందం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనున్న నేపథ్యంలో తెలంగాణ ఐకాస నేతలు, ప్రజలకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
17 జైపాల్ తో మాటలు
ఢిల్లీలో భేటల పరంపర కొనసాగుతోంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు , నేతలు సమావేశమయ్యారు.
16 శాంత్రిభద్రతలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ఈ రోజు కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తలేదని, అంతా ప్రశాంతంగా ఉందని షిండే చెబుతున్నారు.
15 సోనియా ముగ్గురుతో భేటీ
కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ , సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ , తదితరులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. వీరంతా సోనియాతో సమావేశమై ఈ రోజు జరగబోయే యూపీయే భేటీ, సీడబ్ల్యూసీ సమావేశం పై చర్చిస్తున్నట్లు సమాచారం.
14 భవిష్యత్తు ముఖ్యం : చిరు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సీమాంద్ర ప్రజాప్రతినిధుల భేటీ ముగిసింది. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తమకు రాష్ట్రం , పార్టీ భవిష్యత్ ముఖ్యమని వెల్లడించారు. ఎవరికీ అసంత్రుప్తి లేనటువంటి , అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని వెల్లడించారు.
13 రాష్ట్రపతి తో రేణుకా చౌదరి భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏఐసీసీ అధికార ప్రతినిది రేణుకాచౌదరి భేటీఅయ్యారు.
12 తెలంగాణకు నేను వ్యతిరేకం
ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకమని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ప్రకటించారు. ప్రత్యక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.
11 అమ్మతో సీమాంద్ర నేతల భేటీ
సీమాంధ్ర నాయకులు దిగ్విజయ్ సింగ్ తో భేటీ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో భేటీ అయ్యారు.
10 . సీఎంతో టీ నేతలు భేటి
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో ఢిల్లీ ఏపీభవన్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు సమావేశం అయ్యారు.
9 అధిష్ఠానం నిర్ణయం తర్వాత : మంత్రి గంటా ప్రకటన
రాష విభజన పై అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక కార్యచరణ ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు , ఏరాసు ప్రతాపరెడ్డి, టి.జి వెంటకటేష్ , తదితరులు సమావేశం అయ్యారు.
15 మంది మంత్రుల లేఖ
మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడూతూ.. రాష్ట్రాన్ని విభజిస్తే 15 మంది మంత్రులు రాజీనామ చేస్తానమని సోనియా లేఖ ఇచ్చినట్లు చెప్పారు.
రేపు మాట్లాడతాను : మంత్రి
ఎప్పుడు సంచలనమైన ప్రకటనలు చేస్తూ ఎప్పుడు మీడియాలో కనిపించే మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. రేపు రాయలసీమ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మ్ ల్యేలు సమావేశమై కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
8. ఢిల్లీకి బయలుదేరిన బాగ్యనగర్ బ్రదర్
నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాద్ పై తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపేందుకు వీరు ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నారనే వూహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రిలిద్దరూ ఢిల్లీ పయనమయ్యారు.
7. మన్మోహన్ సింగ్ తో సోనియా భేటి
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై ఇవాళ సాయంత్రం యూపీయే , సీడబ్ల్యూసీ భేటీ ఉన్న విషయం తెలిసిందే.
6. సిడబ్ల్యూసి నేతలతో భేటి అవుతున్న తెలంగాణ నేతలు
ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ప్రాంత నేతలు, ఎంపీలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో వరుసగా భేటీ అవుతున్నారు. తెలంగాణకు మద్దతివ్వాలని సిడబ్ల్యూసి సభ్యులను కోరాతున్నారు.
5. డిగ్గీ రాజాతో సీమాంద్ర నేతల భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ తో ఈ రోజు ఉదయం సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో దిగ్విజయ్ తో సీమాంద్ర నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
4. విభజనపై నిర్ణయం జరుగుతుందని అనుకోవడం లేదని, సమైక్యాంధ్ర కోసం చివరి క్షణం వరకు ప్రయత్నిస్తామని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు.
3.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ రోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు.
2. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. సీమాంధ్ర నేతలు మంగళవారం ఉదయం పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు నివాసంలో సమావేశమయ్యారు. తనకు మీసాలు ఉన్నాయి గానీ తెలంగాణను ఆపే దమ్ము లేదని కనుమూరి బాపిరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను ఆపేందుకు సీమాంధ్ర నాయకులు చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
1. తెలంగాణ మంత్రులు కె. జానా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డికె అరుణ, పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. - ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వెళ్లనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more