తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని చేసిన ప్రకటన దృష్ట్యా సీమాంధ్రలో చెలరేగిన సమైక్య ఉద్యమ జ్వాల ఊహించినదే అయినా మన నాయకులు ముందస్తు హెచ్చరికలు చేసినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఆత్మస్థైర్యంతో గట్టి నిర్ణయం తీసుకుని ధైర్యంగా ప్రకటన చేసారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా తెలంగాణా ప్రాంత ప్రజల సద్భావనను గెలుచుకున్నారు కానీ సీమాంధ్ర ప్రాంతం నుంచి మరీ ఇంతగా వ్యతిరేకత వస్తుందని ఊహించనట్టున్నారు.
మరో విషయమేమిటంటే సమైక్యాంధ్ర కార్యాచరచరణ సమితితో పాటు రాజకీయ పార్టీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలకు మద్దతునివ్వటం ఒకింత గుబులు కలిగించే అంశమైనట్టుగా కనిపిస్తోంది.
అందుకే సీమాంధ్ర నాయకుల భుజస్కంధాల మీద మరో బాధ్యతను కూడా పెట్టినట్టుగా సమాచారం. అదేమిటంటే సీమాంధ్రవాసులకు రాష్ట్ర విభజన మంచి చర్యేనని నచ్చజెప్పటం.
విభజన వలన సీమాంధ్రకు మంచి జరుగుతుందని, అభివృద్ధి పథంలో పోవటానికి అవకాశం ఉందని, వారు భయపడుతున్నట్లుగా వారికి ఆర్థికంగా నష్టమేమీ జరగదని, బోలెడంత సాయం అందుతుందని వారికి అర్థమయ్యే విధంగా చెప్పి ఉద్యమాన్ని మొదట్లోనే తుంచివేసే విధంగా తమ ప్రాంత ప్రజలను ప్రభావితం చేయాలని సోనియా గాంధీ సీమాంధ్ర నేతలకు ఆదేశాలిచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం.
దానికనుగుణంగా ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర పరిస్థితులను సమీకరిస్తున్నారు. కార్యదర్శి, డిజిపిలతో సమావేశమైన కిరణ్ కుమార్ పరిస్థితులను చాకచక్యంగా నియంత్రించాలని, బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లను కూడా ఉపయోగించకుండానే సాధ్యమైనంత వరకు పరిస్థితిని అదుపులోకి తేవాలని సూచించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more