తెలుగు సినిమా కథల్లో ఉన్న వైవిధ్యం, కథనం, కథాగమనం ఇతర భాషలవారికి ముచ్చటగొలుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ మధ్య సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, జాన్ అబ్రహమ్ లు తెలుగు సినిమా కథల మీద చాలా మోజు చూపించారు.
ప్రస్తుతం మహేష్ బాబు నటించిన పూరీ జగన్నాథ్ చిత్రం బిజినెస్ మన్ బెంగాలీలోకి బాస్ గా రూపాంతరం చెందుతోంది. మహేష్ స్థానంలో బెంగాలీ సినిమాల్లో సూపర్ హీరో జీత్ నటిస్తున్నాడు.
సుధీర్ బాబు సినిమా ప్రేమ కథా చిత్రం కన్నడ భాషలోకి రూపాంతరం చెందుతోంది. మారుతి రచనలో జె ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ప్రేమ కథా చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. దీని రిమేకింగ్ హక్కులను తమిళం, హిందీలకు అంతకు ముందే అమ్మారు.
నిఖిల్, స్వాతి నటించిన స్వామి రారా సినిమా కూడా ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించింది. దీన్ని కూడా కన్నడంలో కి రిమేక్ చేస్తున్నారు.
అంతకు ముందు తమిళ్, హిందీ, మలయాళ భాషలనుంచి తెలుగు నిర్మాతలను సినిమా కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. కానీ మనలోనూ సృజనాత్మకత ఉందని, మనం ఎవరినీ అనుకరించ వలసిన అవసరం లేదని ఈ మధ్యకాలంలో చిన్న బడ్జెట్ తెలుగు సినిమాలు నిరూపించాయి. పర భాషా చిత్రాల తెలుగురూపాంతరాలలో ఘన విజయం సాధించింది ఒక్క గబ్బర్ సింగ్ మాత్రమే. అది కూడా పవన్ కళ్యాణ్ నటనతో పాటు చిత్రంలో మన వాళ్ళు జొప్పించిన హాస్య సన్నివేశాల వలన. అందులోనూ పోలీస్ స్టేషన్లో జరిపిన అంత్యాక్షరీ సీన్ వలన.
అందువలన మన నిర్మాతలు, దర్శకులు మనలోనే ఉన్న కళను, సృజనాత్మకతను వెలికితీసి చూడవచ్చు. కాకపోతే అగ్రతారలతో భారీ బడ్జెట్ తో తీసేటప్పుడు దర్శకుడైనా అంతకు ముందు విజయం సాధించిన చిత్రనిర్మాణం చేసుండాలి లేదా అంతకు ముందు ఆ సినిమా మరో భాషలోనైనా మంచి కలెక్షన్ చేసుండాలి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more