సిడబ్లుసి ప్రకటన తర్వాత రాష్ట్ర విభజన మీద ఇన్ని రోజుల తర్వత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో మిశ్రమ స్పందన వచ్చింది.
తాను హైద్రాబాద్ లోనే పుట్టి పెరిగానని, అలా ఎంతో మంద్ హైద్రాబాద్ తమ రాష్ట్ర రాజధానిగా భావించి బ్రతుకుతెరువు కోసం వచ్చారని, వారందరినీ ఇప్పుడు అదాటుగా పొమ్మనటం కూడా సరికాదన్న తన అభిప్రాయాన్ని తెలియజేసిన కిరణ్ కుమార్ రెడ్డి మాటలకు తెలంగాణా నాయకులు కొందరు మండిపడ్డారు. ఆయన సీమాంధ్ర పక్షపాతిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
విభజన మీద పూర్తి స్పష్టనిచ్చిన తర్వాతనే విభజన ప్రకటన చెయ్యాలన్నారాయన. జలవనరులు, ఉద్యోగుల విషయంలో తీసుకోబేయే నిర్ణయాలలాంటివాటిలో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారాయన.
సాక్షాత్తూ మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎప్పుడూ మీడియాలో ఆచితూచి మాట్లాడే డి.శ్రీనివాస్ కిరణ్ కుమార్ రెడ్డి మాటలను ఖండిస్తూ, అవన్నీ పచ్చి అబద్ధాలని, తెలంగాణా ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయని, మంత్రి వర్గాన్ని కూడా తప్పుదోవపట్టిస్తున్న ఆ మాటలు సరైనవి కావని అన్నారాయన.
ఇరుప్రాంత ప్రజల మధ్య సామరస్యం నెలకొల్పాల్సిన ముఖ్యమంత్రే అలాంటి మాటలనటం సబబు కాదని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హతను కోల్పోయారని కూడా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి మాటలు తెలంగాణా ప్రాంత వాసులను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అధిష్టానాన్ని కూడా ఇరుకున పెట్టేలా ఉన్నాయని, ఆయన మాటల వలన తెలంగాణా ప్రాంతంలో కూడా మరోసారి ఉద్యమం మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఆంటోనీ కమిటీ వస్తోందిగా అందులో తన సమస్యలేమైనా ఉంటే చెప్పుకోవాలి కానీ ఇలాంటి రెచ్చగొట్టే బహిరంగ వ్యాఖ్యలను చెయ్యగూడదని అభిప్రాయపడ్డారాయన.
వరంగల్ లో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెరాస నేతలు, ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడటం నైతిక దూరమంటూ ఆయనకు వ్యతిరేక నినాదాలు చేసారు.
కడపలో వీరశివారెడ్డి కిరణ్ కుమార్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ, దీన్ని సమైక్యాంధ్ర దృష్ట్యా శుభసూచనని అన్నారు.
తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి మాటలకు దీటుగా సమాధానం చెప్తానన్నారు.
రాష్ట్రవిభజన గురించిన స్పష్టత ఒక్కటే కాకుండా, అసలు తెలంగాణా అంశం తెరమీదకు రావటానికి కారకులు దివంగత నేత వైయస్ఆర్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడంటూ ఇటు తెదేపాకు అటు వైయస్ ఆర్ దూకుడుకు అడ్డుకట్టవేసే ప్రయత్నం కూడా చెయ్యటంతో ఈ మాటలు నిజంగా ఆయనే మాట్లాడలేదని, కచ్చితంగా పై నుంచి వచ్చిన అదేశాలకు అనుగుణంగానే ఆయన మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రునిగా వ్యవహిస్తూ, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడివుంటానన్న కిరణ్ కుమార్, ఒక్కసారిగా ఇలా మాట్లాడుతున్నారంటే అందుకు పైనుంచి అనుజ్ఞ వచ్చే వుండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ తను చేసిన తొందరపాటు ప్రకటనను సరిదిద్దుకోవటానికి మార్గాలను అన్వేషిస్తోందా అని అనుమానం కూడా వ్యక్తమౌతోందన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more