కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై ప్రకటన చేసినప్పటి నుండి దాదాపు పది, పన్నెండు రోజులు క్యాంపు ఆఫీసుకే పరిమితం అయి, అలకపాన్పు ఎక్కిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెల్లిమెల్లిగా కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం వైపే మొగ్గు చూపుతున్నారా ? అమ్మ మాట తన మాట అని చెప్పే కిరణ్ ఇప్పుడు అమ్మ దారిలోకి వచ్చేస్తున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఆయన తీరు చూసి. దాదాపు పదమూడు రోజుల తరువాత మీడియా ముందు వచ్చి మాట్లాడి పలువురి నుండి విమర్శలు ఎదుర్కొన్న కిరణ్, నిన్న ఏకంగా సచివాలయానికి వెళ్లాడు, అక్కడ మరో అడుగు ముందుకు వేసి మొన్న హైదరాబాద్ లో మోడీ మాట్లాడిన దాని పై కౌంటర్ వేయడమే కాకుండా తెలుగు ప్రాంతం రెండుగా చీలిపోయినా, మనం కలిసే ఉంటాం కదా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలను బట్టి చూస్తే కిరణ్ అధిష్టానం దారిలోకి వచ్చినట్లే ఉందని అంటున్నారు.
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రగిలినంత కాలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోలికి కాంగ్రెస్ హై కమాండ్ రావడానికి కొంత వెనుకాడు తుందని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన తీరు అధిష్టానానికి మింగుడు పడకున్నా ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయనను ఏమీ అనలేని పరిస్థితి. దానికి ముఖ్యమంత్రి బలంగా ఉన్నారని కాదు..ఆయన చేసిన సమైక్యవాదం వాదన అంత బలంగా ఉంది. కిరణ్ మాటల్ని పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా ముందుగా తాము కిరణ్ వ్యాఖ్యల గురించి పరిశీలిస్తామని చెప్పినా, ఆ తరువాత ఆ తర్వాత సి.ఎమ్.ను సమర్ధిస్తూ మాట్లాడి, తెలంగాన ప్రక్రియ కొనసాగుతుందని సోనియా దిగ్విజయ్ చెప్పినట్లు సమాచారం. 125 ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండి పోయింది. అలాంటి వారు ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయం తీసుకోరు. అదును చూసి చూసి దెబ్బ కొట్టేస్తుంది. ఇలాంటి సంఘటనలు కాంగ్రెస్ లో ఎన్నో జరిగాయి. అందుకు మంచి ఉదాహారణ జగన్.
మరి ముఖ్యమంత్రి పై కూడా అంత సీరియన్ గా యాక్షన్ తీసుకుంటుందని అనుకోవడానికి లేదు కానీ, తనదైన పద్దతిలో కిరణ్ ను అధిష్టానం దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని మాత్రం మనం అర్ధం చేసుకోవచ్చు. ఆంటోని కమిటీ నివేదిక తర్వాత కిరణ్ తమ దారికి రాక తప్పదని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తుంది. గతంలో ఎన్నో విషయాల్లో చాకచక్యంగా వ్యవహించిన కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి అదే పద్దతిలో వెళుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more