కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం రాజ్య సభలో రాష్ట్ర విభజన గురించి ప్రకటన చేసారు. హైద్రాబాద్ నగరంతో పాటు రాష్ట్ర విభజనలోని అన్ని అంశాల మీదా అందరి అభిప్రాయాలనూ తీసుకుంటామని, ఆ తర్వాతనే విభజన ప్రక్రియ ప్రారంభమౌతుందని అన్నారు. కాకపోతే అదంతా ఎప్పుడౌతుందో మాత్రం చెప్పలేదు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అనారోగ్య పరిస్థితి వలన ఆయన బదులు కూడా చిదంబరం ప్రశ్నోత్తరాలలో పాల్గొన్నారు. ప్రతిపక్ష భాజపా నాయకుడు అరుణ్ జైట్లీ, చర్చలకు ముందు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు మద్దతిస్తోందా లేదా అన్నది అర్థం కాకుండా మాట్లాడుతున్నారన్నదానికి కూడా చిదంబరం పై మాటలనే మరోసారి చెప్పారు.
అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలనూ దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటామనీ, తదనుగుణంగానే విభజన జరిగి తెలంగాణా రాష్ట్ర అవతరణ జరుగుతుందని చెప్పారు చిదంబరం. ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతోందని, విభజన ప్రకటన విషయంలో తొందరపాటు తనాన్ని చూపించిందని అన్నారు.
దానికి సమాధానంగా, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, జార్ఘండ్ రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యటానికి ఎన్ డి యే కూడా రెండు సంవత్సరాలు తీసుకుందని గుర్తుచేసారు చిదంబరం. అంతే కాదు, మొదట్లో భాజపా తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడిందని, ఇప్పుడున్నట్టుండి అనుకూలంగా మాట్లాడుతోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో చెయ్యవలసిన హోం వర్క్ చెయ్యకుండానే గబగబా విభజన గురించిన ప్రకటన చేసేసిందని ప్రతిపక్షం చేసిన ఆరోపణకి, శ్రీ కృష్ణ కమిటీ చేసిన పని అదే కదా. ఆ కమిటీ ఎన్ని విధాలుగా చెయ్యవచ్చన్న విషయాన్ని సూచించింది అన్నారు చిదంబరం. అయితే అందులో ఏ విధానాన్ని అవలంబిస్తారో మాత్రం తెలియజేయలేదు.
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భాజపా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలను విమర్శించారాయన. తెదేపా ఏదైనా నిర్ణయం తీసుకుంటేనేమో అది ప్రజాస్వామ్యం అవుతుందా, అదే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అప్రజాస్వామ్యమా అంటూ ఆయన విమర్శించారు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రక్రియ ఒకవేళ జరగటమంటూ జరిగితే ఎప్పటికి పూర్తవుతుందన్నది చిదంబరం చెప్పలేకపోయారు కానీ, ప్రతిపక్షాల చేసే ప్రతి ఆరోపణా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తుందని తన విశ్వాసాన్ని మాత్రం ప్రకటించారాయన.
ఈ తర్క వితర్కాలు, ఎత్తిపొడుపులు, పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించటం, వైరి పక్షాల మీద విమర్శనాస్త్రాలు వెయ్యటం, ఇవన్నీ సరే కానీ సామాన్య మానవుడిక అర్థమయ్యే విధంగా సూటిగా కచ్చితంగా రాష్ట్ర విభజన జరుగుతుందా, జరిగితే ఎప్పుడు అన్నది మాత్రం స్పష్టంగా లేదు. జరిగేదంతా రాజ్యాంగ బద్ధంగానూ అంతకు ముందు జరిగిన విభజనల విధానాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతుందని మాత్రం అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.
విపక్షాలు ఎంత విమర్శిస్తే కాంగ్రెస్ కి అంత బలం ఏర్పడుతోంది అని చిదంబరం అంటున్నారు కానీ రాజకీయ నాయకుల ప్రకటనలతో సామాన్యమానవుడిని ఇంకా అర్థం కాని అయోమయానికి గురిచేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more