ఎంతటివారైనా కూతురి పెళ్ళి వచ్చేసరికి పూర్తిగా మెత్తబడిపోతారని రామ్ గోపాల్ వర్మ ను చూస్తే మరోసారి అనిపిస్తుంది. అణిగిమణిగి ఉండటం, పెళ్ళి కొడుకు తరఫువారి ఇష్టాలకు తలవొగ్గటం లాంటివన్నీ ఆచారంగా వస్తున్నందువలనే కాదు, కూతురు ఇల్లు విడిచి వెళ్ళిపోతుందన్న తండ్రి హృదయంలోని బాధ బయటకే కాదు తనకు తాను కూడా చెప్పుకోలేని, అర్థమే కాని విధంగా ఉంటుంది. ఆ వ్యథకు స్పష్టత ఉండదు. జరిగేది శుభకార్యమైనా బాధ ఎందుకు కలుగుతుందన్నదానికి నిర్వచనం చెప్పలేని స్థితి.
రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి తన డాక్టర్ ప్రియుడు ప్రణవ్ తో ఆగస్ట్ 15 న మూడు ముళ్ళు వేయించుకుంటున్న సందర్భంగా వర్మ ఈ వేడుకను చిన్న పరిధిలో ఆర్భాటం లేకుండా చెయ్యదలచుకున్నా పెళ్ళనేసరికి పనులకు కొదవుండదు. ఏమాత్రం బెట్టుకి పోకుండా, అల్లుడి కాళ్ళు కడగటంతో సహా సాంప్రదాయబద్ధంగా వస్తున్న అన్ని ఆచారాలనూ పాటించటానికి వర్మ అంగీకరించారట.
ఇంతకీ వింతైన అహ్వానం ఏమిటంటే, పెళ్ళి పెద్దెత్తున చెయ్యకపోయినా అందరికీ తెలియజేయటం విధి కనుక, రామ్ గోపాల్ వర్మ అందరినీ ఈవిధంగా ఆహ్వానించారు.
ఆగస్ట్ 15 న సాయంత్రం 8.45కి జరుగుతున్న నా కూతురు వివాహం నాకు తప్పించుకోలేని ఒక బాధ్యత. రాదలచుకుంటే తప్పక రండి కానీ దంపతులను ఆశీర్వదించటం కంటే నేనెంత జోకర్ లా కనిపిస్తానో చూడటానికి.
ఎప్పుడూ వివాదాలను కోరుకుంటున్నట్టుగా కనిపించే రామ్ గోపాల్ వర్మ తనలోని సున్నితమైన హాస్యాన్ని ఈ విధంగా ఆహ్వానానికి జోడించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more