ఆహార భద్రత బిల్లు పార్లమెంటులో పాసయినట్లయితే ప్రభుత్వం మీద సంవత్సరానికి 125 లక్షల కోట్ల భారం పడుతుంది. 62 మిలియన్ టన్నుల బియ్యం, గోధుమలు, పప్పులను సమకూర్చవలసి వస్తుంది. అయితే ప్రపంచంలో అతి పెద్ద పథకమైన ఈ ఆహార భద్రత బిల్లు మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీని ద్వారా దేశంలోని 70 శాతం ప్రజలకు ఆహార సమస్య పోవటం, ఆకలి చావులు తగ్గిపోవటమే కాక, దీన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ కి ఫిక్స్ డ్ డిపాజిట్ లా పనిచేస్తుంది. దేశప్రజలలో సద్భావన పొంగిపొరలుతుంది. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు ఇవి-
1. దేశంలో 2 3 జనభాకు అర్హత గల కుటుంబంలో ప్రతి వ్యక్తికీ ఐదు కిలోల ఆహార ధాన్యాలు 1రూ నుంచి 3 రూపాయల వరకు ధరలో లభిస్తాయి. ఈ రాయితీ పిడిఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) ద్వారా వారి ఖాతాలలోకి చేరుతాయి.
2. దీనితో ప్రపంచ దేశాలలో తమ పౌరులకు అధిక జనాభాకు ఆహార భద్రతనిచ్చే దేశాల జాబితాలోకి చేరిపోతుంది.
3. 125 లక్షల కోట్ల వ్యయం చేసే ఈ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ పథకమౌతుంది.
4. ఈ బిల్లు పార్లమెంటులో పాసయిన తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం పెట్టటంతో అమలులోకి వస్తుంది.
5. 2.43 కోట్ల జనాభాగా అంచనా వేసిన నిరుపేదలు అంత్యోదయ అన్న యోజన పథకం కింద కుటుంబానికి నెలకి 35 కిలోల ఆహార ధాన్యాలు అందుకోవటానికి అర్హులౌతారు.
6. మరో ముఖ్యమైన అంశమేమిటంటే ఇప్పటి వరకూ రేషన్ విషయంలో ఇంటి పెద్దగా మగవాళ్ళని పరిగణనలోకి తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పడు ఈ ఆహార భద్రతా బిల్లు పుణ్యామా అని ఆహార ధాన్య వితరణ విషయంలోకి వచ్చేసరికి మహిళలను (18 సంవత్సరాలు దాటినవారిని) ఇంటి పెద్దగా పరిగణించటం జరుగుతుంది.
7. ఈ పథకం కింది గర్భిణీ స్త్రీలు, ప్రసవించిన తర్వాత శిశువు ఆరు నెలలకు వచ్చేంతవరకూ ఆహారం ఉచితంగా అందించబడుతుంది.
8. ప్రతి శిశువుకీ ఆరు సంవత్సరాలు నిండేంత వరకూ స్థానిక అంగన్ వాడి ద్వారా సరియైన పౌష్టికాహారాన్ని కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది.
9. 6 నుంచి 14 సంవత్సరాల వరకు పిల్లలకు మధ్యాహ్న భోజన వసతి లభిస్తుంది. ఇది ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు లభిస్తుంది.
దేశంలోని ఆకలి చావులు, పౌష్టికాహార లోపంతో బలహీనమైన బ్రతుకులు దేశంలోని ప్రతి పౌరుడూ సిగ్గుపడి బాధపడవలసిన విషయం. అందువలన ఈ పథకం చాలా మంచిదన్నది నిర్వివాదం. కానీ దీని అమలు విషయంలోనే ఎన్నో సందేహాలు చోటుచేసుకుంటాయి. దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చకు తీసుకునివస్తే ఇందులో ప్రతిపక్షాలు కూడా అభ్యంతరాలు తెలిపే అవకాశం లేదు కానీ ప్రవేశపెట్టటానికే వీలు కావటం లేదు. ఏదో ఒక అంశం మీద వాగ్వివాదాలు, నిరసనలు, అవేశకావేషాలు బిల్లుని ప్రవేశపెట్టకుండా చేస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more