విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విభజించవద్దన్న డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేస్తున్న సమరదీక్షకు సీమాంధ్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఆమెకు సంఘీభావం తెలుపుతూ దీక్షలు చేస్తున్నారు. రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విజయమ్మ ఈరోజు బాగా నీరసించారు. ఈరోజు ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు పల్స్, బీపీ, షుగర్ లెవల్స్ బాగా తగ్గాయని చెప్పారు. ద్రవాహారాన్ని తీసుకునేందుకు కూడా ఆమె నిరాకరిస్తున్నారు. తక్షణమే దీక్ష విరమించాలని డాక్టర్లు సూచించారు. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న డాక్టర్లు హెచ్చరించారు. ఆమె వయసుకు ఈ విధంగా దీక్ష చేపట్టడం మంచిదికాదని చెప్పారు. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాలని వారు చెప్పారు. అయినా ఆమె మొక్కవోని పట్టుదలతో 4వ రోజు సమరదీక్ష కొనసాగిస్తున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు వైఎస్ భారతీ, షర్మిల, వైఎస్ వివేకానందారెడ్డి వచ్చి ఆమె పరామర్శించారు. పార్టీ నేత మైసూరారెడ్డితోపాటు పలువురు నాయకులు వచ్చి సమరదీక్షకు మద్దతు తెలిపారు.
విజయమ్మది దొంగ దీక్ష..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మది దొంగ దీక్షని, కొంగ జపమని తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అడిస్తున్న నాటకంలో భాగమే ఈ దీక్షని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా వైసీపీ చేసిన వ్యాఖ్యల సీడీని టీడీపీ విడుదల చేసింది. తెలంగాణకు అనుకూలమని గతంలో దివంగత వైఎస్, విజయమ్మ , జగన్లు చెప్పారని, తెలంగాణకు మద్దతుగా వైఎస్ అధిష్టానం వద్దకు పంపిన వారిలో తాను కూడా ఉన్నానని కొండా సురేఖ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోసమే తెలుగు ప్రజలను బలి చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more