రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాల చెల్లింపు అంశం సందిగ్ధంగా తయారైంది. గడచిన మూడు వారాలుగా సీమాంధ్రలో ప్రభుత్వ లావాదేవీలు దాదాపు స్థంభించిపోయాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో పని పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వానికి ఆదాయ మార్గాలైన పన్ను చెల్లింపులు, రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ లోటు ఏర్పడింది. వీటన్నింటికంటే గత 10 రోజులుగా ట్రెజరీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళారు. ఈ సమ్మె వల్ల రాష్ట్రంలో 184 సబ్ ట్రెజరీ కార్యాలయాలలో ప్రభుత్వ లావాదేవీలపై ప్రతిష్టంభన నెలకొంది. మొత్తం 3500 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళడం సబ్ ట్రెజరీ కార్యాలయాలలో లావాదేవీలు జరగడం లేదు. ఈ 184 సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి రోజుకు రూ. 150 కోట్ల ఆదాయం వస్తోంది. గడచిన 10 రోజులుగా ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళడం వల్ల దాదాపు రూ. 1800 కోట్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. మరో వారం రోజులూ పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. సమ్మెలోకి వెళ్ళిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలను చెల్లించదు. అయితే సమ్మె చేయకుండా విధులకు హాజరవుతున్న వారికి వేతనాలను ఎలా చెల్లించాలన్న అంశంపై ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ట్రెజరీ ఉద్యోగులతో పాటు వాణిజ్య పన్నుల శాఖ, రవాణా, రెవెన్యూ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్ళడంతో ప్రభుత్వ ఖజానాకు ఇతరత్రా రావాల్సిన డబ్బులు కూడా నిలిచిపోయాయి. వీరికి తోడుగా సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు సమ్మెలోకి వెళ్తుండటంతో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. ప్రభుత్వ ఖజానాకు ఒక్క రోజు దాదాపు రూ. 3 వేల కోట్లుగా వస్తుంది. సమ్మెలు, ఆందోళనల వల్ల గడచిన మూడు వారాలుగా ఇందులో పదో వంతు కూడా ఖజానాకు ఆదాయం సమకూరడం లేదు. ఖజానాకు చేరిన డబ్బులు కూడా రోజువారీ వ్యయానికి కూడా సరిపోవడం లేదని అధికారులు అంటున్నారు. ఉద్యోగుల వేతనాలకు కావాల్సిన మొత్తాన్ని కేంద్రం నుంచి అప్పుగా తీసుకు రావాలని అధికారులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more