అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్యరాష్ట్రం కోసం చంచల్‌గుడా జైలులో దీక్ష చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో జగన్ దీక్ష ప్రారంభించనున్నారు. జగన్ దీక్షపై పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటన వచ్చే వరకు దీక్ష చేయాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్షను గుంటూరులో పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. విజయమ్మ దీక్ష భగ్నం నేపథ్యంలో తాను దీక్ష చేయాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాలవారికి సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథ స్థితిలో ఉంచాలని వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అదే వైఖరితో సీమాంధ్రలో తన ఉద్యమాన్ని సాగిస్తోంది. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి పూనుకుందని వైయస్ జగన్ విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే వైఎస్ జగన్ ఆదివారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చెయ్యటానికి సిద్దమైనట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి
అబ్బాయి చెబితే ఒకే
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను విరమించారు. ఆమె ఆరోగ్యం పూర్తీగా క్షీణించిన పరిస్థితులలో పార్టీ అధ్యక్షుడు, కుమారుడు వైఎస్ జగన్మోహన రెడ్డి నచ్చజెప్పడంతో విజయమ్మ దీక్ష విరమించారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తక్షణం దీక్ష విరమించాలన్న వారి విజ్ఞప్తిని ఆమె తిరస్కరించారు. దాంతో వారు బలవంతంగా పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా ఆమె దీక్ష కొనసాగించారు. ఇదే విధంగా దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరం అని వారు హెచ్చరించారు. ఆమె మూత్రపిండాలు పాడయ్యే అవకాశముందన్నారు. తక్షణం వైద్యచికిత్స అందించకుంటే మెదడు మీదా ప్రభావం చూపుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ విడుదలవుతున్నట్లు తేలిందని, ఇది ప్రమాదకరమని వైద్యులు తెలిపారు. కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు. అయినా ఆమె వినలేదు. దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఈ పరిస్థితులలో జైలు అధికారుల సహకారంతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఆరోగ్యకారణాల రీత్యా దీక్ష విరమించమని తల్లికి ఆయన నచ్చజెప్పారు. తొలుత ఆమె జగన్ చెప్పినా వినలేదు. ఉద్యమాన్ని కొనసాగిద్దామని, దీక్ష విరమించమని ఆయన కొద్దిసేపు నచ్చజెప్పిన తరువాత విరమించడానికి ఆమె అంగీకరించారు. అయితే వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సహాం కనబడుతుంది. పార్టీ అధినేత జైల్లో సమర దీక్ష చెయ్యటానికి సిద్దమవుతున్నాడని తెలియటంతో.. వైసీపి సీనియర్ నాయకులు వైఎస్ జగన్ ను కలిసే పనిలో బిజీగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more