రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ... సీమాంధ్ర ఏపీ ఎన్జీఓలు నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న టి.కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ జేఏసీ నాయకులు విడివిడిగా సభలు పెట్టేందుకు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో టి. కాంగ్రెస్ నాయకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ సభను ఈనెల 21 లేదా 22 తేదీల్లో నిర్వహించాలని సీఎల్పీ కార్యాలయంలో జరిగిన టి. కాంగ్రెస్ నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రులు కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్‌కుమార్, ఎంపీలు మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.ఎ. ఖాన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ పొలిటికల్ జేఏసీ కూడా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి తన సత్తాను చాటాలని నిర్ణయించింది. ఈ సభ ఒక రకంగా తెలంగాణ బల నిరూపణకు వేదికగా మలచాలని టి.జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఇక వీరు నిర్వహించ తల పెట్టిన సభకు టీఆర్ఎస్ పార్టీ నుండి, తెలంగాణకు మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల నుండి మద్దతు లభిచింది. ఇక ఈ సభకు సీమాంధ్ర ఉద్యోగులు వచ్చిన దాని కంటే భారీ సంఖ్యలో ఉద్యోగులు, ప్రజలను సమీకరించి తెలంగాణ వాదం బలమేమిటో నిరూపించాలని భావిస్తోంది. ఈ సభతో తెలంగాణ వాదం వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న భావనను కేంద్ర ప్రభుత్వంలో కలిగించాలని యోచిస్తోంది. టి.కాంగ్రెస్ వారు తలపెట్టిన సభకు ‘సద్భావనా ’ సభగా పేరుపెడితే బాగుం టుందని కొందరు సూచించారు. సభను ఈనెల 21 లేదా 22 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈనెల 15న టీ కాంగ్రెస్ ప్రజాప్రతిని దులు, ఇతర నేతలతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టీ జాక్ నేతలు కూడా ఈనెల చివర్లలోగా సభను నిర్వహించాలని చూస్తున్నారు. మొత్తంగా చూస్తే గణేష్ నిమజ్జనం తరువాత హైదరాబాద్ లో తెలంగాణకు సంబంధించి రెండు భారీ బహిరంగ సభలు జరగనున్నాయన్న మాట. మరి ఈ పోటా పోటీ సభల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more