బాలీవుడ్ ఖాన్ లు సల్మాన్ - షారూఖ్ ఖాన్ ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో ఆమె విషయం అయిన చిన్న పాటి గొడవ కాస్తంత వైరంగా మారింది. అప్పటి నుండి ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్న వీరు మొన్న రంజాన్ సందర్భంగా జరిగిన ఇస్తార్ విందులో ఒకరినొకర్ని కౌగిలించుకొని తన వ్యక్తిగత వివాదాలకు స్విస్తి చెప్పారని అందరు అనుకున్నారు. ఆ తరువాత నుండి వీరిద్దరు ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు కూడా. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా సల్మాన్ షారూఖ్ పై ఉన్న అక్కసును మరోసారి వెల్లగక్కాడు. తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవంటూనే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ ఫైట్ కు రాజీలేదని షారూఖ్ కి సవాల్ విసిరాడు. ప్రస్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ చిత్రం బాలీవుడ్ రికార్డుల్ని బద్దలు కొట్టి టాప్ పొజిషన్ లో నిలించింది. దీని పై సల్మాన్ మాట్లాడుతూ... షారూఖ్ ని త్వరలో మట్టి కరిపిస్తానని సవాల్ విసిరాడు. బాక్సాఫీస్ వద్ద ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ సృష్టిస్తున్న రికార్డుల గురించి తనకు చింత లేదని, గతంలో నా పేరిట ఉన్న రికార్డులను ఆయన అధిగమించాడు. నాకేమైనా ఇబ్బంది ఉంటే తాను తన సామర్ధ్యంతో అధిగమిస్తాను అని సల్మాన్ తెలిపాడు. అమీర్ ఖాన్ ధూమ్-3 చిత్రం కాని..రణబీర్ మరో చిత్రం కాని.. మరేవ్వరి చిత్రమైనా కాని.. బాక్సాఫీస్ వద్ద తన తదుపరి చిత్రంతోనే సమాధానమిస్తానని అన్నాడు. మరి సల్మాన్ షారూఖ్ సినిమా కొడుతున్న రికార్డులను ఉద్దేశించి సవాల్ విసిరినా, వ్యక్తిగతంగా ఉన్న విభేదాల ఉద్దేశ్యంతోనే ఈ సవాల్ విసిరాడని అంటున్నారు. చూద్దాం ఈ ఖాన్ వ్యవహారం మళ్ళీ ఎంత దూరం వెళుతుందో ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more