‘‘ చావు కబురు చెబితే.. సద్దన్నం తినిపోదాంలే అన్నడట ’’ అనే విధంగా మన నేతల పరిస్థితి ఉందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. రాష్ట్ర విభజన, ప్రకటన వచ్చిన నాటి నుండి సీమాంద్ర ప్రజలు , సీమాంద్ర ప్రాంత నేతలను.. రాజీనామలు చేసి, ఉద్యమానికి సహకరించండిని సమైక్యవాదులు మొత్తుకున్నారు. సమైక్యవాదులు చేసిన ఆర్తనాధాలు .. సీమాంద్ర నేతల ముందు ఆవిరిగా మారిపోయింది. ‘‘ పక్కింట్లో దొంగలు పడితే .. మనింట్లో కాదుగా ’’ అనే విధంగా సీమాంద్ర నేతలు ప్రవర్తించారు. 65 రోజుల నుండి సీమాంద్ర ప్రజలు సమైక్యాంద్ర కోసం ఉద్యమం చేస్తున్నారు.
సీమాంద్ర రాజకీయ నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించారు. సీమాంద్ర నేతల అసమర్థకు గుర్తుగా కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్ ను ఆమోదించింది. ఇన్ని రోజులు నిద్రపోయిన కేంద్ర మంత్రులు .. తెలంగాణ నోట్ ఆమోదం పొందినవెంటనే .. కొంత మంది కంటితూడుపుగా రాజీనామాలు చేయటం జరిగింది. వీరికి తోడుగా. తెల్లారిన తరువాత.. మరికొంత మంది రాజీనామాల డ్రామాలు ఆడటం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ‘‘ శోభనం రాత్రి భార్య మనసును అర్థం చేసుకోలేని వాడు.. ఇక జీవితాంతం ఏం అర్థం చేసుకుండో ’’ అనే పాత మాటలు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణ నోట్ ముందుకు ఉపయోగపడని వీరి రాజీనామాలు .. అసెంబ్లీలో తీర్మానంలో ఏం ఉపయోగపడతాయోని సీమాంద్ర ప్రజలు అడుగుతున్నారు. ఇంత జరిగిన కూడా సీమాంద్ర నేతల్లో ఎలాంటి చలనం కనిపించటం లేదు. ఇక ఇప్పుడు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించిన తర్వాత పదవులను వీడుతాం అంటున్నారు.
అయితే ఇది మరో మోసం అని చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన ఏమీ చట్టబద్దంగా, న్యాయంగా జరగడం లేదు, అధిష్టానం తమకు ఎలా అనుకూలంగా ఉంటే అలానే రాష్ట్రాన్ని చీల్చడానికి పూనుకుంటుంది. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు కనుక రాజీనామా చేసి ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెడితే అప్పుడు వారి భాద్యత తీరినట్లు. అయితే ఆ తర్వాత రాష్ట్ర పతి పాలన పెట్టి విభజన చేసినా కానీ అది అధిష్టానందే తప్పు అవుతుంది. అసలు వీళ్ళు ఓడించడానికి అసలు టీ బిల్లు అసెంబ్లీకి రావాలి కదా? దాని అవసరం లేకుండానే ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
ఒకవేళ అసెంబ్లీ ఓడినా కానీ విభజనకు అది ఏ మాత్రం ఆటంకం కాదు. మరి అలాంటప్పుడు ప్రజలు ఎన్నుకున్న నేతలగా ప్రజలు డిమాండ్ చేస్తున్న రాజీనామాలను చేసి వాటిని నిజాయితీగా ఆమోదింపజేసుకుంటే కొంతవరకైనా వారి భాద్యత తీరినట్లు. అయితే నేతలు మాత్రం అసెంబ్లీలో ఓడిస్తాం అంటూ పదవులను పట్టుకువేలాడుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఒకటి బాగా అర్థమైంది.. ‘‘ రణరంగంలో హోర హోరిగా యుద్దం జరుగుతుంది.. రణరంగంలోకి అందరు వీరోచితంగా పోరాడి.. చివరకు వీరమరణం పొందుతారు. కానీ ఒక పిరికి అధికారికి యుద్ద భూమికి దూరంగా ఉండి అన్ని విషయాలు గమనిస్తారు. ఇక తనకు ఎలాంటి ప్రాణహానీ లేదని తెలియటంతో.. తన దగ్గర ఉన్న పదునైన కత్తి తీసుకొని, యుద్దభూమిలో నిర్జీవంగాపడి ఉన్న సైనికుల తలలను నరికి, తీసుకువెళ్లి తన పై అధికారులకు చూపించి మెప్పుపొందాడు..’’ అలాగే సీమాంద్ర ప్రాంత నేతలు వ్యవహరిస్తున్నారని.. సమైక్యవాదులు అంటున్నారు. తమ ఓటు హక్కుతో గెలిచిన సీమాంద్ర ప్రాంత నాయకులు తమపైనే సవతి తల్లి ప్రేమ చూపించటం చాలా దారుణంగా ఉందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
లాఠీ విరిగి, తూటా పేలింది!
ఇప్పటి వరకు సీమాంధ్ర ఉద్యమంలో ఎక్కడా లాఠీలు విరగలేదు. తూటా కూడా పేలలేదు. గతంలో తెలంగాణా ఉద్యమంలో వీటి వాడకం చాలా ఉండేది. అయితే సీమాంధ్ర ఉద్యమంలో చాలా వరకు అది లేదనే చెప్పాలి. శాంతి యుతంగానే తన నిరసనను తెలియజేస్తున్న సీమాంధ్ర ప్రజలపై తోలి సారిగా ఈ రోజు లాఠీ విరిగింది, తూటా పేలింది.
పోలిసుల లాఠీలు సీమాంధ్ర ఉద్యమకారుల వీపులపై నాట్యమాడుతున్నాయి. ఫలితంగా సమైక్య ఉద్యమ వీపు పగిలిపోతుంది.
రబ్బరు బుల్లెట్లు వాడకూడదని చెప్పినా కానీ రబ్బర్ బుల్లెట్ల గాయాలు మాత్రం సీమాంధ్ర ఉద్యమంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లా కేంద్రాలలో పరిస్థితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు ద్వంసం అయ్యాయి. ముఖ్యంగా బొత్స జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలలో కూడా పరిస్థితి దాదాపు క్షీణించింది. సీమాంధ్ర ఉద్యమ కారులు పోలీసులుపై కూడా తిరగబడుతున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను కూడా మొహరించారు. దీంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అర్ధం కాక సామన్య జనం భయాందోళనలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more