ఆయన పార్టీకి జైలు దెబ్బ తగిలింది. జైలు దెబ్బ ఏమిటో ఆ పార్టీలో నాయకులకు తెలిసి వస్తుంది. ఆయన ఒకప్పుడు సింహం లాంటి వాడు. కానీ ఆయన ఆ సింహం 16 ఏళ్ల కింద పశువుల దాణా మేసింది. అధికారంలో ఉన్నప్పుడు దాణా మేసినందుకు ఇప్పుడు జైలు శిక్షపడింది. ఇప్పుడు ఆయన గురించి ఆయన భార్య రంగంలోకి దిగింది. నాభర్త జైలులో ఉన్నా కందకంలో తమ పార్టీ కార్యకర్తల చిత్తస్థయిర్యం ఏమాత్రం తరిగి పోలేదనీ, ఆయన కందకంలో పడిన సింహం లాంటివాడనీ, మళ్ళీ జనం ముందుకు వస్తారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి చేసిన వ్యాఖ్యలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
వ్యక్తులపై ఆధారపడిన పార్టీలను కాపాడుకోవడానికి భార్య లేదా, కుటుంబ సభ్యులు ప్రజల ముందుకు వచ్చి సానుభూతి అలలను సృష్టించడం ఇక్కడ మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పదహారు మాసాలు జైలు జీవితం గడిపినప్పుడు చూశాం. పశుగ్రాసం కుంభకోణంలో లాలూకి ఐదేళ్ళ జైలు శిక్ష పడటం, ఆయన జైలుకి వెళ్ళడం వంటి పరిణామాలు ఆర్‌జెడిని దెబ్బదీసే ప్రమాదం లేదని రబ్రీదేవి చెప్పినప్పటికీ, ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ లేకపోవడం వల్ల ఆ పార్టీ భవితవ్యం అంతా రబ్రీదేవిపైనే ఆధారపడి ఉంది. ఆమె నేర్పుగా, ఓర్పుగా పార్టీని ఏకతాటిపై నడిపించగలరా? అన్నదా అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న. ఆయన జైలులో ఉన్నా పార్టీని తాను నడిపిస్తానంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి రబ్రీదేవి ప్రకటించారు.
లాలూ గతంలో ఇదే మాదిరిగా అరెస్టు అయి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినప్పుడు ఆమె ఆ పదవిని నిర్వహించారు. దాణా కుంభకోణంలో ఇప్పటికి ఐదుసార్లు జైలుకి వెళ్ళిన లాలూని తాజా కేసులో దోషిగా నాలుగు రోజుల క్రితమే సిబిఐ కోర్టు నిర్ధారించి ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. ఇప్పుడు లాలూ జైలుకి వెళ్ళడం వల్ల సానుభూతి పనిచేస్తుందని ఆయన భార్య రబ్రీదేవి ఆశిస్తున్న ప్పటికీ, పార్టీ కేడర్ లాలూ బయట ఉన్నప్పుడే కకావికలయ్యారు. లాలూ బావమరిది సాధూ సింగ్ పార్టీలు మారడంలో అగ్రగణ్యుడు. లాలూకి ఇప్పుడు నమ్మకమైన అనుచరులు ఎవరూ లేరు. దానికితోడు ఆయన జైలు గోడల మధ్య దీర్ఘకాలం ఉంటే పార్టీ మనుగడ ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమే. కాంగ్రెస్ సాయంతో నితీశ్‌కుమార్ బలాన్ని పుంజుకుంటారా? లేక కాంగ్రెస్, బిజెపిలను సమాన దూరంలో పెట్టి మూడవ ఫ్రంట్ నాయకుడు అవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏమైనా లాలూ జైలులో ఎంతకాలం ఉన్నా, ఆయనకు శిక్షపడటం ఆ పార్టీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more