రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదా? అందుకే వెనకడుగు వేస్తుందని బీజేపి పార్టీ నాయకులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో దొంగలెవరో, దొరలెవరో ప్రజలే నిర్ణయిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సత్తా పార్టీ నుంచి 2009లో నగరంలోని పలు నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేసిన అభ్యర్థులు భాజపాలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భాజపాను దొంగల పార్టీ అంటూ విమర్శించడంపై ఆయన స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కేంద్రంతో సహా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పలు కుంభకోణాల్లో ఆ పార్టీ నేతలే ముద్దాయిలని, అటువంటి వారు బిజేపిని విమర్శించడంని దొంగే దొంగ..దొంగ అన్న చందంగా ఉందన్నారు.
దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని, దీనిలో భాగంగా మేము సైతం అంటూ పలు పార్టీల్లోని ప్రముఖ నేతలు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు బిజేపిలో చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి- అధర్మానికి, నీతికి -అవినీతికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. వాజ్‌పాయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఆరు సంవత్సరాల పనితీరు, సోనియా నేతృత్వంలో ప్రధాని మన్మోహన్సింగ్ పనితీరును ప్రజలు బేరీజు వేస్తున్నారని తెలిపారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని తాము వివరిస్తామని యుపిఎ 2004, 2009లో అధికార పగ్గాలు చేపట్టాక ఏంచేశారో బయట పెట్టాలన్నారు.
చాయ్ అమ్మె వ్యక్తి ప్రధాని అవుతాడంటూ మోడీని ఎద్దేవా చేస్తున్నారని, అయితే ఇటలీనుంచి వచ్చిన సోనియా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావచ్చా అని ప్రశ్నించారు. ధైర్యముంటే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పప్పుముద్ద అని ఇప్పటికే నిరూపించుకున్న రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే ధైర్యం లేకే కాంగ్రెస్ మౌనం వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో కూడా విప్లవాత్మక మార్పులు రానున్నాయని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజలు బిజేపి ఆలోచనలను అర్థం చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్రలు చేపట్టినా ప్రజలు వారిని నమ్మబొరన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ భూస్థాపితం కాక తప్పదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more