ఐటీ రంగానికి తిరిగి డిమాండ్ పుంజుకోవడంతో ఐటీ రంగం హర్షం వ్యక్తం చేసింది. అయితే దానికి తగ్గట్లు అనుభవజ్ఞులైన ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం వేరే కంపెనీలకు వెళ్లడంతో పలు కంపెనీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్లీ ఐటీ రంగానికి డిమాండ్ పెరగడంతో మళ్లీ ఐటీ కంపెనీలకు వలసల దెబ్బ మొదలైంది. ఇటీవల కంపెనీలు రెండవ త్రైమాసిక ఫలితాలు వెల్లడించాయి. వాటిలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆరు త్రైమాసికాల్లో ఎన్నడూ లేని విధంగా జులై - సెప్టెంబర్ 2013లో అత్యధికంగా ఉంది.
అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఐటీ నిపుణులకు పెద్దగా డిమాండ్ లేదనే చెప్పాలి. దీంతో వలసలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక మళ్లీ డిమాండ్ పుంజుకోవడంతో కొత్త అవకాశాల కోసం ఉద్యోగులు కొత్త కంపెనీలకు వలస వెళుతున్నారని మైండ్ ట్రీ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ చెప్పారు. జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో అతి పెద్ద ఐటీ కంపెనీలకు కూడా వలసల సెగ తాకింది. ఐటీ నిపుణుల సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ సెగ పెద్ద ఐటీ కంపెనీలకే కాదు మిడ్ సైజ్ కంపెనీలకు పాకింది. అంచనా ప్రకారం వచ్చే నాలుగు త్రైమాసికాల్లో ఈ వలసలు మరింత పెరుగుతాయని సుమారు 100-200 బేసిస్ పాయింట్లు వరకు పెరగవచ్చునని రవిశంకర్ అన్నారు. ఇన్ఫోసిస్ క్యూ2లో గత ఆరు నెలల్లో ఎన్నడూ లేని విధంగా వలసలు 17.3 శాతానికి చేరింది. సంవత్సరం క్రితం ఇది 15.0 శాతమని పేర్కొంది. కాగా ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఇది 16.9 శాతామని వివరించింది. క్యూ2లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు కూడా వలసల సెగా బాగానే తాకింది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనంత్ గుప్తా మాట్లాడుతూ ఐటీ కంపెనీలకు వలసల సెగ తాకడానికి ప్రధాన కారణం ఐటీ నిపుణులకు తిరిగి డిమాండ్ పెరగడమేనని ఆయన వివరించారు. తమ కంపెనీ నుంచి బాగా నైపుణ్యం కలవారిని వేరే కంపెనీ తీసుకెళ్లిన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని... ఎందుకంటే మార్కెట్లో తమ కంపెనీ బలమైన బ్రాండ్ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి 16.1 శాతానికి చేరగా.. సంవత్సరం క్రితం 14 శాతమని హెచ్‌సీఎల్ పేర్కొంది. కాగా దేశంలో ఐటీ రంగానికి చెందిన కంపెనీల్లో మూడవ స్థానంలో ఉన్న విప్రో సెప్టెంబర్ త్రైమాసానికి వలసలు 15.4 శాతం కాగా.. క్యూ1లో 13.0 శాతమేనని పేర్కొంది.
అయితే చాలా మంది ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీల్లో అసంతృప్తి వల్ల ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు మానేసి కొత్త కంపెనీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఉద్యోగులకు మంచి ప్యాకేజీ ఇచ్చి తీసుకువెళుతుండటంతో వలసలు ఖచ్చితంగా పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలో ఉద్యోగులకు 5-6 శాతం వరకు వేతనాలు పెంచుతుంటారు. ఒక వేళ కంపెనీ మారితే ఆ ఉద్యోగి వేతనంలో 15-20 శాతం వరకు పెరుతుంది.
దీంతో పాటు మరో కారణం ఏమిటంటే ఉద్యోగికి విదేశాల్లో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా కల్పించబడుతుందని క్రిస్ లక్ష్మీకాంత్ హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపకులు సీఈవో చైర్మన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం ఐటీ కంపెనీలో రాబోయే కొన్ని నెలల్లో 200-300 బీపీఎస్ పాయింట్లు వలసలు పెరిగే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వలసలు మరింత జోరందుకునే అవకాశం ఉందని దీనికి పలు కారుణాలు ఉన్నాయని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more