కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన.. యూపీఏ నెత్తిన ఇదో పిడుగు. ఇన్ని రోజులు తెలంగాణ విషయంలో ఒంటెద్దు పోకడలు ప్రదర్శిస్తూ... తనకు తోచిందే చేసుకుంటూ పోతూ, సీమాంధ్ర మంత్రుల, ఎంపీల మాటలను పెడచెవిన పెట్టి రాష్ట్రాన్ని విభజించిన అధిష్టానంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ ఎంపీలు తన సొంత పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దం అయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు తన సొంత ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం పెడుతూ స్పీకరుకు నోటీసు ఇచ్చారు.
నేటి ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన తరువాత వాయిదా పడింది. కొద్ది సేపటి వాయిదా తరువాత సమావేశం ప్రారంభం కావడంతో లోక్ సభ స్పీకర్ కు ఎంపీలు సంతకాలు చేసిన పత్రాన్ని అందజేస్తూ అవిశ్వాస తీర్మానం కోరారు. నోటీసు ఇచ్చిన వారిలో ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, సాయిప్రతాప్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్ తదితరులున్నారు. రాష్ట్ర విభజన పై కేంద్రం వెనక్కి తగ్గకపోతే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడతారనే ప్రచారం ఎప్పటి నుండో జరిగినా, చివరికి వీరు మాత్రమే ముందుకు వచ్చారు.
అధిష్టానానికి సన్నిహితంగా ఉండే వారు వెనక్కి తగ్గారు. దీంతో వీరికి మెజారిటీ సంఖ్య లేకుండా పోయింది. ఒకవేళ అందరు అవిశ్వాస తీర్మానానికి సిద్దపడితే పరిస్థితి వేరేలా ఉండేది. వీరి నోటీసు ఇవ్వడం వరకు బాగానే ఉన్నా... సీమాంధ్ర ప్రజల మెప్పు పొందాలని ఇలా చేశారా ? లేక నిజంగానే అధిష్టానంతో అమీతుమీ తేల్చుకుంటారా అన్నది చూడాలి.
ఒకవేళ వారు సీరియస్ గా తీసుకుంటే అధిష్టానం ఎటువంటి చర్యతీసుకోబొతుందో కూడా ఆసక్తి నెలకొంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతోనే ఈ నోటీసు ఇచ్చామని సీమాంద్ర ఎంపీలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more