పదిహేను సంవత్సరాలుగా ఢిల్లీ ప్రజలకు సేవలు అందించిన ఏకైక రాజకీయ మహిళ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్. ఈరోజు షీలా మీడియాతో మాట్లాడుతూ తను ఓడిపోవటానికి గల కారణాలను మీడియా ముందు చెప్పటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు తగినంత మద్దతు లభించలేదని షిలా దీక్షిత్ అన్నారు. 15 ఏళ్లపాటు ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా ప్రభుత్వానికి ఈ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. పార్టీ మాత్రమే కాక షీలా కూడా స్వయంగా ఓడిపోయారు.
అదీ ‘ఘజియాబాద్ మనిషి ’గా తాను కొట్టిపడేసిన అరవింద్ కేజ్రీవాల్ చేతిలో భారీ ఓట్ల తేడాతో.. ఈ ఓటమి ఆమెకు మింగుడు పడని విషయమే.అందుకు కారణం తనకు పార్టీనుంచి లభించవలసిన మద్దతు లభించకపోవడమేనని షిలా ఛెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా అంత : కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వం ఒకే దారిలోలేవని నిన్న పార్టీ నేత జనార్థన్ ద్వివేది వ్యాఖ్యానించడాన్న షిలా దీక్షిత్ గుర్తు చేశారు.
ఇప్పటికైనా పార్టీలు అసలు సమస్యని గుర్తించినందకు సంతోషం అన్నారు. విద్యుచ్ఛక్తి బిల్లులు అసలు సమస్యేకాదని, నిత్యావసరాల ధరలు తగ్గించడానికి తాము చేయదగినంత చేశామని షీలా చెప్పుకొచ్చారు. విద్యుచ్ఛక్తి, నీటి బిల్లుల విషయంలో ఇతర పార్టీలు అసాధ్యాలు మాట్లాడుతున్నాయన్నారు. నిజంగా వాటిని తగ్గించగలిగితే సంతోషించేవారిలో తానూ ముందుంటాన్నారు. కేజ్రీవాల్ తెలివిగల వ్యక్తని, ఆయనకకు తన సలహా అవసరం లేదని షీలా వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more