Trs leader kcr photo halchal in sachivalaya

kcr, sonia gandhi, sachivalaya, trs leader kcr, kcr cm, trs party, congress party, telangana state, telangana leaders, telangana congress leaders.

trs leader kcr photo halchal in sachivalaya

సచివాలయం లో కేసిఆర్ కుర్చీ?

Posted: 02/21/2014 06:18 PM IST
Trs leader kcr photo halchal in sachivalaya

అవును మీరు  చదివింది నిజమే. కాకపోతే..కొంచెం సమయం పడుతుంది.  కానీ ఇలోపే.. కేసిఆర్  సచివాలయంలో  వచ్చాడాడు.  అదీ కూడా  సోనియా గాంధీ కలిసి  కేసిఆర్  సచివాలయం  ముందు నిలబడి ఉన్నారు.

అంటే కేసిఆర్ మనసులో  కోరికను  ఇలా బయట  పెట్టారో లేక కాంగ్రెస్ పార్టీ  టిఆర్ ఎస్ పార్టీ విలీనం అవుతుందనే  ఉద్దేశంతో  పెట్టారో తెలియాదు గానీ.. మొత్తం మీద  కేసిఆర్ , సోనియా గాందీ కలిసి నిలబడిన  ప్లేక్సీ   సచివాలయంలో  హల్ చల్ చేస్తుందని ..తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.   

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే..  మొదటి ముఖ్యమంత్రి  ఎవరు  అంటే  గుప్పిడు పేర్లు వినబడుతున్నాయి.  వీరికి తెలంగాణ రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందో లేదో తెలియాదు గానీ,  కేసిఆర్  కు మాత్రం సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కనిపింస్తుందని  మీడియా వర్గాలు అంటున్నారు. అందుకు నిదర్శనం పైన కనిపిస్తున్న ప్లేక్సీ అనే అంటున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నారు అంటూ హైదరాబాద్ సచివాలయం స్పష్టం చేసింది. అదేంటి అధికారికంగా సచివాలయం అప్పుడే తెలంగాణ సిఎం ను ప్రకటించిందా ఏంటి అంటూ హైరానాకు గురికావద్దు. ఎందుకంటే ఇది అధికారిక ప్రకటన కాదు, కాని ఓ చిత్రం సచివాలయ చరిత్రలో మునుపెన్నడు లేని చిత్రమైన సీన్ కు కారణమైంది.  అయితే  ఈ చిత్రం  చూసిన  తెలంగాణ కాంగ్రెస్  నాయకులు మాత్రం ఆవేశంతో  ఊగిపోతున్నారు. 

 కేసిఆర్  ప్లేక్సీ  సచివాలయం లో  ఉండటం చూసిన  టీఆర్ఎస్ నాయకులు, కేసిఆర్ అభిమానులు   ఆనందంతో పొంగిపోయి,  సచివాలయానికి వచ్చి, తమ అభిమాన నాయకుడ్ని  చూసుకుంటున్నట్లు మీడయా  వార్తలు వస్తున్నాయి.  

అయితే ఒక్కసారిగా  సచివాలయంలోకి .. టీఆర్ఎస్ నాయకులు, కేసిఆర్ అభిమానులు రావటం తెలంగాణ  కాంగ్రెస్ నాయకులు మండిపోతున్నారు.  సచివాలయం సిబ్బంది చేత గేట్లు  మూచివేసినట్లు  తెలుస్తోంది.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి,  పరిస్థితి చక్కబెట్టి,  అక్కడ నుంచి  కేసిఆర్ ప్లేక్సీ  ని తీసి బయట పెట్టించినట్లు  తెలంగాణ కాంగ్రె స్ నాయకులు అంటున్నారు. 

టిఆర్ఎస్  పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాకముందే ఇలా ఉంటే.. ఇక విలీనం అయిన  తరువాత ఎలా ఉంటుందోనని  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles