Pawan kalyan preparing to spread his party in five states

pawan kalyan, janasena party in five states, pawan kalyan latest news, pawan kalyan janasena, pawan kalyan jana sena party, pawan kalyan campaign, pawan kalyan in gopala gopala movie, pawan kalyan latest press meet, pawan kalyan with raju raviteja, jana sena party news, jana sena party symbol, pawan kalyan comments on narendra modi, pawan kalyan comments on kcr

pawan kalyan preparing to spread his janasena party in five states

పవన్ కల్యాణ్ తిక్కతో ఐదురాష్ట్రాలకు పంచ్!

Posted: 07/28/2014 12:41 PM IST
Pawan kalyan preparing to spread his party in five states

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీరు ఎప్పుడు, ఎలా వుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ‘‘గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది’’ వంటి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుని సెన్సేషనల్ హీరోగా టాలీవుడ్ లో పేరు నమోదు చేసుకున్న ఈ పవర్ స్టార్... ఎవరూ ఊహించని తరుణంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేసి అందరికీ షాక్ కి గురిచేశారు. ఆ పార్టీ ప్రచార నేపథ్యంలోనే కొంతమంది రాజకీయ నాయకుల రహస్య జీవితాల గురించి చెప్పకనే చెప్పిన పవన్.. తదనంతరం సంచలన నాయకుడిగా పేరు కూడా సంపాదించేశారు. ఈక్రమంలో ఆయన తన పార్టీకి ‘‘జనసేన’’ అని పేరు పెట్టేశారు.

ఆ సమయంలో పార్టీ తరఫున అభ్యర్థులు లేరనే కారణంతో ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ... బీజేపీ, టీడీపీ వంటి పార్టీలకు మద్దతుగా ప్రచారాలు చేసి, అసలైన నాయకుడిగా ప్రజల నుంచి ఆదరణ పొందారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన కొన్నాళ్లవరకు రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేశారు. కానీ తన పార్టీ పేరును, తన పేరును ఉపయోగించుకుని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకున్న పవన్.. వెంటనే దానిమీద యాక్షన్ తీసుకుని తన పార్టీని అభివృద్ధి చేసుకునే పనుల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన పార్టీ గుర్తుగా ‘‘పిడికిలి’’ని ఎంచుకున్నారని.. అందుకు సంబంధించిన వివరాలను ఆగస్టు 15వ తేదీన పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లో చెబుతారని అనధికారికంగా సమాచారం అందింది.

ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఆయన ప్రియమిత్రుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పార్టీ గుర్తు అయిన ‘‘పిడికిలి’’ని ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారని జనసేన వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే జనసేన పార్టీ ఏర్పాటులో క్రీయాశీలకంగా వ్యవహరించిన రాజురవితేజ్ కు పార్టీ కోర్ కమిటీ ఏర్పాటు బాధ్యతలను పవన్ కల్యాణ్ పూర్తిగా అప్పగించినట్టు పార్టీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా త్వరలోనే వెల్లడవుతాయని వర్గాలు స్పష్టం చేశాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేయాలని భావిస్తున్నట్టు సమాచారం! ఈ క్రమంలోనే ఈ ఐదు రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు పవన్ కల్యాణ్ అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నారు. ఒకవైపు ‘‘గోపాల గోపాల’’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే.. మరోవైపు జనసేన పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో ఫుల్ బిజీలో మునిగిపోయారు పవన్! ఇంకొక విశేష వార్త ఏమిటంటే.. త్వరలో జరగనున్న జీఎచ్ఎంసీ ఎలక్షన్ల ద్వారా వవన్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారు.

‘‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’’ అని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ లాగే... ఆయన తన తిక్కతో ఐదు రాష్ట్రాల్లో పార్టీ పంచ్ గుర్తును ముద్రవేయడానికి సన్నాహాలను మొదలుపెట్టడాన్ని చూసి... ‘‘పవన్ కల్యాణ్ తిక్కను లెక్కేయడం చాలా కష్టమేనని’’ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా పార్టీకి సంబంధించిన అధికార ప్రకటనలు వెలువడకముందే ఇంతగా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్... పార్టీ ఊపందుకుంటే రాజకీయాల్లో ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తాడోనని అందరూ లెక్కలు వేసుకుంటున్నారు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles