Former central minister shashi tharoor wife sunanda pushkar murder mystery revealed by forensic reports

sunanda pushkar, sunanda pushkar murder mystery, sunanda pushkar news, shashi tharoor sunanda pushkar, pak journalist mehar tharar, shashi tharoor mehar tharar, delhi police news, delhi police commissioner, aims forensic reports

former central minister shashi tharoor wife sunanda pushkar murder mystery revealed by forensic reports

వీడిన సునంద పుష్కర్ మర్డర్ మిస్టరీ!

Posted: 10/10/2014 08:50 PM IST
Former central minister shashi tharoor wife sunanda pushkar murder mystery revealed by forensic reports

కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందాపుష్కర్ ఆత్మహత్య చేసుకున్న వార్త దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే! తన భర్త శశిథరూర్ తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ వ్యవహారం నడుపుతోందని అనుమానం వ్యక్తి చేసిన ఆమె... మెహర్ తో ట్విటర్ లో సంవాదం చేసి, తన భర్తతో కూడా వాగ్యుద్ధానికి దిగినట్లు ఆ మధ్య వార్తలు వెల్లడయ్యాయి. అనంతరం ఆమె ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం విదితమే! అయితే ఈమె మరణం వెనుక ఖచ్చితంగా ఎవరిదో హస్తం వుందని భావించిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణను చేపట్టారు. మొదట శశిథరూర్, మెహర్ తరార్ మధ్య వున్న రిలేషన్ గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తదనంతరం ఎన్నో విధాలుగా విచారణ చేపట్టారు. అయితే తాజాగా వెలువడిన సునందా పోస్టు మార్టం పరీక్షల్లో ఆమె మర్డర్ వెనుకున్న రహస్య మిస్టరీ చివరికి వీడింది.

పోస్టుమార్టం రిపోర్టు వెలువడిన వెంటనే ఈ పరీక్షలను నిర్వహించిన స్పెషల్ మెడికల్ టీం మొదట ఆమెకు విషప్రయోగం జరపడం వల్లే మృతిచెందాని నిర్ణయించింది. ఈ పరీక్షల్లో శరీర అంతర్భాగాలను పరిశీలించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విషప్రయోగం జరిగిందని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఈ విషయమై ఎయిమ్స్ వైద్య బృందం ఒక నివేదికను పోలీసులకు సమర్పించినట్లు సమాచారాలు కూడా అందాయి. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు... మరోమారు పరిశీలించాల్సిందిగా ఎయిమ్స్ వైద్యులను కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు రెండోసారి పరిశీలన జరిపిన వైద్యులు... విషప్రయోగం కారణంగానే సునంద మరణించిందని తేల్చేశారు. అయితే ఇదే విషయమై మాట్లాడిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ మరోరకంగా రిపోర్టు నివేదికను వెల్లడిస్తున్నారు.

గురువారం విడుదలైన సునంద పోస్టుమార్టం రిపోర్టు నివేదికలో వెల్లడైన సమాచారం ప్రకారం ఆమె మరణానికి విషప్రభావమే కారణమని.. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ చేతికి ఇంకా రాలేదని తెలిపారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే వున్నామని ఆయన వెల్లడించారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తన నివేదికను ఢిల్లీ పోలీసులకు సమర్పించి పదిరోజులైందని పేర్కొన్న ఆయన.. ఇందులోని సీక్రెట్ అంశాలు ఇప్పుడే లీక్ అయ్యాయని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన తగిన ఆధారాలను త్వరలోనే బయటపడేలా ప్రయత్నాలు చేస్తామని, ఈ కేసులో వున్న మిస్టరీని త్వరలో ముడితీస్తామని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles