Power star pawan kalyan political plans for movie and chiranjeevi family

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan janasena, pawan kalyan chiranjeevi, chiranjeevi news, chiranjeevi news, ram charan news, tollywood news, janasena party news, congress party, pawan kalyan chiranjeevi janasena news, narendra modi, chandrababu naidu, telangana state, gopala gopala movie, gabbar singh

power star pawan kalyan political plans for movie and chiranjeevi family

పవన్ పన్నుతున్న వ్యూహాత్మక రచనలు లీక్!

Posted: 10/11/2014 01:34 PM IST
Power star pawan kalyan political plans for movie and chiranjeevi family

టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ‘‘గోపాల గోపాల’’ చిత్రం షూటింగ్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి తెరమీద కనిపించడం లేదు. అలాగే సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన కొన్నిరోజుల తర్వాత మళ్లీ రాజకీయరంగంలో కనిపంచిన దాఖలాలు అస్సలు లేనేలేవు. ఇక గతకొన్నిరోజుల నుంచి చిరు-పవన్ ల మధ్య మళ్లీ చీలికలు వచ్చేశాయని.. అందువల్లే వాళ్లిద్దరూ కలవడం లేదనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కు సంబంధించిన అందుబాటులో వున్న వార్తలు కేవలం ఇవే! ఇంతకుముందు మరే కథనాలు బయటకు రావడం లేదు.. తన అన్నయ్యతో బంధం తెగిపోయిందన్న విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు... రాజకీయరంగానికి ఎందుకు దూరంగా వుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. అనేక సందేహాల మధ్య ప్రతిఒక్కరూ ఆలోచనల్లో పడిపోయారు. ఎందుకు పవన్ తెరమీదకు కనిపించడం లేదంటూ ప్రశ్నోత్తరాలు వస్తున్నాయే తప్ప.. వాటికి జవాబు ఇవ్వడానికి పవన్ బయటకు మాత్రం రావడం లేదు.

‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడానికి నేనున్నాను’’ అంటూ ప్రజలకు హామీ ఇచ్చిన పవన్.. ఇప్పుడు ఎక్కడా కనిపించకుండాపోయాడని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుతో చాలా సన్నిహితంగా వున్న ఆయన.. ఇప్పుడు వారితో కలవడం కాదు కదా.. అసలు వారి గురించి మాట్లాడటమే లేదు. ఏవైనా కొత్త కార్యక్రమాలు, ప్రణాళికలు వంటి చేపట్టిన సందర్భంలో పవన్ ఆహ్వానం పంపించే మోడీ కూడా ఆయన ప్రస్తావన అస్సలు తేవడం లేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ పాత్ర అమోఘమంటూ పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన మోడీ... ఇప్పుడు పవన్ అంటే ఎవరో తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి అటు రాజకీయపరంగానూ.. కుటుంబనేపథ్యంగానూ.. సినిమా సందర్భాలన్నింటిలోనూ పవన్ గురించి వస్తున్నవార్తలు గందరగోళంగానే వున్నాయి. వీటన్నింటినీ బాగా గమనిస్తే.. లోలోపలే పవన్ ఏవో వ్యూహాత్మక రచనలు చేసుకుంటున్నారనే అనుమానాలను రేకెత్తుతున్నాయి.

నిన్నటికినిన్న మోడీ, బాబులతో కలిసి భుజాలు తడుముకుంటూ తిరిగిన పవన్.. ఇప్పుడు పూర్తిగా వారినుంచి - రాజకీయరంగం నుంచి దూరంగా జరిగిపోవడంతో ఆయన తన జనసేన పార్టీకి సంబంధించి ఏవో ప్లాన్లు చేస్తున్నారనే అంతర్గత వార్తలు వెలువడుతున్నాయి. మొదట్లో అభ్యర్థులు లేని కారణంగా ఎన్నికల్లో పోటీచేయని పవన్.. 2019 ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలనే పూర్తి ప్లాన్ లో వున్నారని టాక్! అందుకే ఆయన మోడీ, బాబులతో కలవడమే కాకుండా.. తన పార్టీ గురించి ఇంతవరకు ఏ విషయం బయటపెట్టకుండా రహస్యంగానే వుంచుతున్నారు. జనసేన పార్టీ అభ్యర్థుల విషయాలను చాలా గోప్యంగా దాస్తున్నారని... ఎన్నికల బరిలో దిగేముందు పవన్ అన్నీ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇవ్వడం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. అంటే.. మొత్తానికి ఆయన తన పార్టీ మీద పూర్తిగా దృష్టి సారించి... భారీ మెజార్టీతో గెలిచే ఆకాంక్షతో వున్నారని అనుకుంటున్నారు.

ఇదిలావుండగా... పవన్ - చిరుకు మధ్య చీలికలు రావడానికి రాజకీయాలే కారణమంటూ అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అన్న ప్రజారాజ్యం పార్టీకి ప్రచారకర్తగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాష్ట్రం మొత్తం పర్యటిస్తే.. ఎన్నికల తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పవన్.. అప్పటినుంచి చిరుతో మాట్లాడటం, కలవడం జరగలేదు. అయితే మధ్యలో ఆడియో ఫంక్షన్ల నేపథ్యంలో వారిద్దరూ కలవడంతో గొడవలు దూరమయ్యాయని అనుకున్నారు. కానీ పవన్ జనసేన పార్టీని ఆవిర్భవించి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారాలు మొదలుపెట్టడంతో మళ్లీ అన్నదమ్ముళ్ల మధ్య విభేదాలొచ్చాయని వార్తలొచ్చాయి. తమమధ్య ఎటువంటి గొడవలు లేవని రాం - చిరులు చెప్పినప్పటికీ.. పవన్ వారితో కలిసిన దాఖలాలు కనిపించడకపోవడంతో వారిమధ్య చీలకలున్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో రాజకీయ కారణాలవల్లే మెగాఫ్యామిలీ చీలిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి పవన్ రాజకీయపరంగా దూరంగా వుండటంతో ఆయన మెగాఫ్యామిలీకి దగ్గరవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. తన అన్నయ్య కుటుంబంతో తిరిగి బంధాలు చక్కదిద్దుకోవడం కోసమే పవన్ రాజకీయపరంగా దూరంగా వుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు.

మరోవైపు.. పవన్ తన సినీ కెరీర్ దెబ్బతినకూడదనే భావనతోనే రాజకీయాలకు దూరంగా వుంటున్నారనే అనుమానాలూ వస్తున్నాయి. రాజకీయంగా పవన్ ఏమైనా స్పందిస్తే.. రెండు రాష్ట్రాల్లో ఆయన సినిమాలకు దెబ్బపడే అవకాశం ముందని అందరూ భావిస్తున్నారు. అందువల్లే ఆయన రాజకీయంగా ఏమీ స్పందించడం లేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా.. పవన్ రాజకీయంగాగానీ, తన పార్టీ గురించి ఏమీ స్పందించకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడాలంటే.. అందుకు పవన్ కల్యాణే స్వయంగా తెరముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : pawan kalyan  chiranjeevi  narendra modi  chandrababu naidu  janasena party  

Other Articles