bjp plans to break up pdp, to quit from jammu and kashmir government

Bjp plans to quit from jammu and kashmir government

jammu kashmir, isis flags, seperatists, bihar, isis, Narendra Modi, Nitish Kumar, pakistan, Islamic State (IS), Isis flag, Jammu and Kashmir, Prime Minister Narendra Modi, PM Modi, 56 inch chest, pakistan, isis, Tehreek-e-Hurriyat, amit shah, JK

As indian citizens expressed concern over raising of flags of terror group ISIS and Pakistan in JK, bjp plans to break up pdp, to quit from jammu and kashmir government

పీడీపీతో తెగతెంపులకు బీజేపి యోచన..?

Posted: 06/16/2015 07:03 PM IST
Bjp plans to quit from jammu and kashmir government

భారత దేశానికి సిగలో పువ్వులా వుంటే జమ్మూకాశ్మీర్ లో రోజురోజుకు వేర్పాటు వాదులు అగడాలు శృతిమించిపోతున్న తరుణంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. యావత్ దేశ ప్రజలతో పాటు అటు ప్రతిపక్షాలు, ఇటు జమ్మూకాశ్మీర్ లోని తమ పార్టీ ప్రముఖులందరూ కాశ్మీర్లోని పరిస్థితిపై తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ప్రతిపక్షాలు అటు భయాందోళనతో పాటు విమర్శలను కూడా అదేస్థాయిలో గుప్పిస్తుండటంతో బిజేపి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నుంచి ఏదో ఒకటి తేల్చుకునే యోచనలో వుంది.

ఇందుకోసం జమ్మూకాశ్మీర్ లోని పిడిపీ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిర్ణయించుకున్నారని సమాచారం. జమ్మాకాశ్మీర్ ప్రభుత్వానికి మద్దుతు ఉపసంహరించుకుని.. ఆ తరువాత దేశానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు, పాకిస్థానీ, లష్కరే తాయిబా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద జెండాలు ప్రదర్శించిన వారిపై చర్యలకు ఉపక్రమించాలని కేంద్రం సహా బిజేపి యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఇంకా తాము మీనమేషాలు లెక్కపెడుతుంటే.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లోకి బలంగా చోచ్చుకువెళ్లే అవకాశముందని బిజేపి భావిస్తుంది.

మునుపెన్నడూ లేనివిధంగా గత శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఇస్లామిక్ స్టేట్ జెండాలు ఎగురువేయడంతో యావత్ దేశస్తులు తీవ్ర అంధోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఒకనాటి మిత్రడు, ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి ఏకంగా మోడీపై సూటీగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు మందు మోదీ భారత ఆర్మీ దళాలకు చెందిన సైనికులు 56 అంగుళాల చాతి బలాన్ని వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పించిన మోడీ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలను ప్రదర్శిస్తుంటే నీరో చక్రవర్తిలా చోద్యం చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలు ఎగురువేస్తుంటే మోదీ ఛాతి బలం ఎక్కడకెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో పీడిపితో తెగదెంపులు చేసుకుని వేర్పాటు వాదులకు తగిన బుద్ది చెప్పాలని కేంద్రంతో పాటు బీజేపి యోచిస్తుందని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  isis  Tehreek-e-Hurriyat  Narendra Modi  amit shah  56 inch chest  India  JK  

Other Articles