గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నామని గత ఆరు మాసాల నుంచే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం డొల్లతనం రాజమండ్రి తొక్కిసలాటతో బయటపడటంతో.. ప్రభుత్వం ఎదురుదాడికి తెరలేపింది. రోజుకు 20 లక్షల నుంచి 30 లక్షల మంది చొప్పున సుమారుగా మూడు నుంచి నాలుగు కోట్ల మంది వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయలేక, విమర్శల పాలయ్యింది. రాజమండ్రిలోని కోటగుమ్మంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలను సంధించాయి.
కోట్లు ఖర్చు చేసి సౌకర్యాలను కల్పించామని ప్రకటించిన ప్రభుత్వ ప్రచారాన్ని కూడా భారీ స్థాయిలోనే కల్పించింది. కానీ, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. స్వయంగా చంద్రబాబు కూడా సౌకర్యాలను పూర్తి చేయకపోవడంపై రెండు రోజుల ముందు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజమండ్రి తొక్కిసలాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వివిఐపీ ఘాట్ లో స్నానాన్ని ఆచరించకుండా చంద్రబాబు.. సాదరణ ఘాట్ లో స్నానం ఆచరించడం.. అప్పటి వరకు భక్తులను సాన్నాలు చేయకుండా ఆపడం, ఆ తరువాత వరుస క్రమంలో కాకుండా ఒకేసారి భక్తులను వదలడంతో.. ఈ ఘటన జరిగిందని జగన్ ఆరోపించారు.
అయితే ఈ విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘనటనను ఆసరాగా చేసుకుని విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రతిష్మాత్మకంగా చేపడుతున్న పుష్కరాలలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికారంలో వున్న ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. విపక్ష నేత జగన్ అరోపించినట్లు చంద్రబాబు.. ప్రచార ఆర్భాటం కోసం సాదారణ ఘాట్ లో స్నానం చేసిన విషయం నిజమేనా..? కాదా..? అన్న అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అయనే మూలాంగానే తొక్కిసలాట జరిగిందా..? లేదా..? అన్న విషయమై కూడా ప్రభుత్వం బదులు చెప్పాలి.
ప్రభుత్వాధినేతగా ఆయనకు లభించే ప్రచారం అంతాఇంతా కాదు. ఈ విషయాన్ని పక్కన బెడితే.. చంద్రబాబుకు మీడియాను ఎలా..? ఎప్పుడు..? మానేజ్ చేయలో బాగా తెలుసునని, కూడా బాగా తెలుసునని ఇప్పటికే మీడియా వర్గాల్లో టాక్. అది చాలదన్నట్లు పుష్కరాలలో కూడా ప్రచారం కోసం బాబు.. ఇలాంటి చౌకబారు ప్రచారం కోసం పాకులాడారా..? లేదా..? అన్న విషయమై వారే క్లారిటీ ఇవ్వాలి. ఇక కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆరోపించినట్లు కృష్ణా పుష్కరాల్లో ఒకరిద్దరు చనిపోతే.. అప్పట్లో విపక్ష నేతగా చంద్రబాబు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాజీనామా చేయాలన్నది నిజం కాదా..? అన్న విషయమై టీడీపీ నేతలు స్పష్టతనివ్వాలి. అయితే అప్పట్లో చంద్రబాబు చేసింది శవరాజకీయమేనా..? కాదా..? అన్నదానిపై కూడా టీడీపీ సమాధానం చెప్పాలి.
35 మంది మరణానికి ఎవరో ఒకరిద్దరు అధికారులను బాధ్యులను చేసి.. వారిపై చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వం తాను చేసిన తప్పిదమేంటన్న విషయాన్ని గ్రహించాలి. శవరాజకీయాలు చేసిన పార్టీ.. ఇప్పడు విమర్శలను గుప్పిస్తున్న విపక్షాలపై మండిపడుతూ.. శవరాజకీయాలు చేస్తారా..? అంటూ ఎదురుదాడికి దిగడం ఎంత వరకు సమంజమో కూడా తెలపాలి. అనుకోకుండా జరిగిన దురదృష్టకర సంఘటన ఇది. ఎంతోమంది తమకు కావాల్సిన వారిని పోగొట్టుకుని పుణ్యానికి వస్తే.. పాపం ఎదురైట్లు చేసిన అన్యూహ ఘటన ఇది అని ప్రభుత్వానికి తెలిసిన నేపథ్యంలో.. విమర్శకుల విమర్శలపై ఎదురుదాడి చేయడం సమంజసమనిపించుకుంటుందా..? అనేది కూడా ప్రభుత్వాధినేత అలోచించాలి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more