Errabelli Dayakar Rao | Revanth reddy | TDP | TTDP | Revanth reddy, Errabelli

Where is errabelli dayakar rao

Errabelli Dayakar Rao, Revanth reddy, TDP, TTDP, Revanth reddy, Errabelli

Where is Errabelli dayakar Rao. After Revanth reddy release Erraballi didnt appear infront of the media.

ఎర్రబెల్లి దయాకర్ రావు ఎ..క్క..డ..?

Posted: 07/16/2015 03:25 PM IST
Where is errabelli dayakar rao

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకుడు, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గత కొంత కాలంగా కనిపించకుండా పోయారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో అప్పడప్పుడు మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడిన ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి విడుదల తర్వాత కనీసం చూద్దామన్నా కూడా కనిపించడం లేదు. అసలే ఎర్రబెల్లి ఎక్కడి కి వెళ్లారు..? ఎందుకు వెళ్లారు...? ఎర్రబెల్లి మౌనానికి కారణం ఏంటి ..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటుకు నోటు వ్యవహరంలో రేవంత్ రెడ్డిని అరెస్టు  చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ తరఫున మీడియాలో మాట్లాడిన ఎర్రబెల్లి రేవంత్ విడుదల తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడలేదు.. కనీసం కనిపించలేదు. జైల్ నుండి విడుదలైన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ గా చేసి ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి బయటకు రాకముందు మైక్ పట్టుకొని ఊగిపోయిన ఎర్రబెల్లి తర్వాత మాత్రం ఎందుకు కనిపించడం లేదు అన్నది ప్రశ్న.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తెలుగుదేశం పార్టీ మీద అటు జగన్, ఇటు కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నగదుతో సహా అడ్డంగా దొరికిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే దీనిపై ఎర్రబెల్లి దయాకర్ రావు తరుచూ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. అయితే ఓటుకు నోటు వ్యవహరంలో ఎ1 ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. రేవంత్ రెడ్డి విడుదల తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కనిపించకుండాపోయారు. తెలుగుదేశం పార్టీ తరఫున మీడియాలో ఏదో వ్యాఖ్యలు చేసే ఎర్రబెల్లి ఎందుకు కనిపించకుండా పోయారు అన్నదాని మీద అనేక ఊహాగానాలున్నాయి.

కొంత మంది అనుకుంటున్న కారణాలు..
* ఓటుకు నోటు వ్యవహారంతో అబాసుపాలు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ కనిపించడానికి ఇష్టపడటం లేదట. అందులో భాగంగానే ఎర్రబెల్లి కూడా కనిపించడం లేదట.
* తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి కన్నా రేవంత్ రెడ్డికే ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వాలని పార్టీ అనుకుందట. అందులో భాగంగానే తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న కొత్తకోట ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి వ్యాఖ్యలను సాక్షాలుగా చూపుతున్నారు.
* ఎర్రబెల్లికి సొంత నియోజక వర్గంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. ఇలాంటి సమయాల్లో మీడియా ముందుకు రావడం ఎందుకు అనే భావనలో ఉన్నట్లు మరో ప్రచారం.
* తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చెయ్యడంలో ఎర్రబెల్లి విఫలమవుతున్నారని అందుకే పార్టీ ఆయన్ను పక్కకు పెట్టిందని.. కలత చెందిన ఎర్రబెల్లి అన్నింటికి దూరంగా ఉంటున్నారని మరో ప్రచారం.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Errabelli Dayakar Rao  Revanth reddy  TDP  TTDP  Revanth reddy  Errabelli  

Other Articles