Telangana TDP and Congress may tie up in this assembly sessions

Telangana tdp and congress may tie up

telangana, Tdp, TRS, congress, kcr, revanth reddy, Assembly, KCR, farmers suicides

Telangana TDP and Congress may tie up in this assembly sessions. In the Telangana Assembly sessions stars tommarrow, Congress aprty and TDP party leaders tried to fight together in this sessions.

తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ లు జతకలిసే..?

Posted: 09/22/2015 10:57 AM IST
Telangana tdp and congress may tie up

ఏ కాలానికి ఆ గొడుగుపట్టకపోతే కుదరదు. తాజాగా తెలంగాణలో పరిస్థితులు మారుతున్నాయి. కేసీఆర్ ఒంటెద్దుపోకడలకు అన్ని పార్టీల నేతలు విసిగిపోయారు. అయితే రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పొత్తుకు తెర తీస్తాయనే వార్త వినిపిస్తోంది. బద్ద శత్రవులైన కాంగ్రెస్, టిడిపి పార్టీలు ఒక్కటిగా టిఆర్ఎస్ మీద దాడికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టిడిపికి అధికంగా లాభం చేకూరబోతోంది. కాంగ్రెస్ నాయకులు, టిడిపి నాయకులు, బిజెపి నాయకులతో కలిసి అసెంబ్లీలో అధికార పక్షం వైఖరిని ఎండగడతారట. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలుసా..?

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రవర్తన మీద తెలంగాణ అసెంబ్లీ వేటు వేసింది. గ‌త రెండు స‌మావేశాల నుంచి రేవంత్ రెడ్డికి స‌భ‌లో మాట్లాడే అవకాశమియ్యలేదు టీఆర్ఎస్. అంత‌కు ముందు స‌భ‌కు  అడ్డుప‌డుతున్నార‌ని టీడీపీ ఎమ్మెల్యేలంద‌రినీ స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. వీటిపై అప్పట్లోనే కాంగ్రెస్ మద్దతు కోరింది టీడీపీ.  సీఎల్పీ నేత‌గా జానారెడ్డి స‌భ‌లో ఈ అంశాన్ని ప్రస్తావించి వ‌దిలేశారు త‌ప్ప ప్రభుత్వాన్ని ఒప్పించి, ఒత్తిడి తెచ్చి స‌స్పెన్షన్‌ను  ఎత్తివేయించ‌లేక‌పోయారు. ఎంఐఎం అయితే ఈ విషయంలో అస‌లు స్పందించ‌లేదు. బీజేపీ చెప్పినా టీడీపీకి మిత్రప‌క్షం కావటంతో ఆ పార్టీ వాదనను టీఆర్‌ఎస్‌ పెద్దగా ప‌ట్టించుకోలేదు. రెండ్రోజుల్లో ప్రారంభ‌మ‌వుతున్న వ‌ర్షాకాల స‌మావేశాల‌కు రైతు ఆత్మహ‌త్యలు, ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ వంటి అంశాల‌తో  వ‌స్తున్నాయి ప్రతిపక్షాలు. దాదాపు ప్రతిపక్షాల‌న్నీ ఇలాంటి అంశాల‌తోనే స‌భ‌కు వ‌స్తున్నా... క‌లిసి పోరాడాల‌న్న ఉద్దేశం మాత్రం ఏ  పార్టీలోనూ క‌నిపించ‌డం లేదంటున్నారు విశ్లేషకులు. మరి అదే నిజమవుతుందా..? లేదంటే పోరాటంలో పక్క పార్టీ వారికి కూడా చోటుకల్పిస్తారా అన్నది చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  Tdp  TRS  congress  kcr  revanth reddy  Assembly  KCR  farmers suicides  

Other Articles