Who will loose their ministries

Who will loose their ministries

KCR, Telangana, Naayini, Talasani, Chandulal, Cabinet, Telangana CM, Ministers

KCR plans to change some several changes in his cabinet. May after the Narayankhed elections KCR will replace some new faces in cabinet.

వాళ్ల మంత్రి పదవులు ఊస్టింగేనా..?

Posted: 10/05/2015 10:17 AM IST
Who will loose their ministries

జనాలు ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందన్న చందాన టిఆర్ఎస్ పరిస్థితి మారింది. గతంలో ఉద్యమ స్థాయిలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న జనాభా కన్నా తెలంగాణ ఏర్పాటు, సొంత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత భారీగా చేరికల ఫలితంగా టిఆర్ఎస్ లో జనాలు ఎక్కువయ్యారు. అయితే అందరికి అన్ని రకాల సాటిఫ్యాక్షన్ దొరకదు కాబట్టి అలకలు కామన్. అయితే ఎవరికి ఏ పోస్ట్ లు ఉంటాయి అన్నదే డౌట్. తాజాగా దసరాలోపు తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు వస్తాయన్న వార్త హల్ చల్ చేస్తోంది. అందులో భాగంగా కొంత మందికి పదవీగండం ఉందని పుకారు షికారు చేస్తోంది. కొంత మంది మంత్రుల మీద కేసీఆర్ అసహనంగా ఉన్నారని.. కాబట్టి వారికి పదవీగండం ఉంది అని అనుకుంటున్నారు. దసరా నాటికి మంత్రి వర్గంలో కొంత మందికి బాయ్ బాయ్ చెబుతారని, కొంత మంది కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకుంటారని పార్టీలో చర్చ సాగుతోంది.

దసరా బొనాంజా ఆఫర్ కింద పోస్టులు ఊడతాయా...? ఉంటాయా..? అన్న డైలమా నడుస్తోంది. పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తూ కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా పేరున్న నాయిన నర్సింహారెడ్డి పేరు కూడా ఊస్టింగ్ లిస్ట్ లో ఉందంటూ వస్తున్న వార్త అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మంత్రి వర్గంలో ఎంతో కీలకమైన హోంమంత్రి పదవి నుండి తప్పించి.. పార్టీ పగ్గాలను కీలకంగా నడిపించేలా నాయినిని సిద్దం చేస్తున్నట్లు సమాచారం.  అలాగే చందూలాల్ ను, తెలుగుదేశం పార్టీ వల్ల తీవ్ర తలనొప్పులకు కారణమవుతున్న తలసాని శ్రీనివాస్ ను కూడా తప్పించాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్తగా  కొప్పుల ఈశ్వర్, రవీందర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి కొండా సురేఖ లేదా వినయ్ భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. వరంగల్ లోక్‌సభ, నారాయణ్‌ ఖేడ్ ఉపఎన్నికల తర్వాత ఈ తతంగం ఉంటుందని, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లోనూ మార్పుచేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana  Naayini  Talasani  Chandulal  Cabinet  Telangana CM  Ministers  

Other Articles