తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పేలవంగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేకుండా ఎలాంటి చర్చలు జరగకుండానే సాగుతున్న అసెంబ్లీ సమావేశాలను త్వరగా ముగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నేత, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా, కాంగ్రెస్, టీడీపీ, బిజెపి, వామపక్షాలు, వైసీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్స్ మెత్తానికి సస్పెండ్ చేసింది ప్రభుత్వం.ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేకుండానే.. తెలంగాణ అసెంబ్లీ నడిచింది. ముందే నిర్ణయించిన ఎజెండాలోని ప్రశ్నోత్తరాలు, వ్యాట్ సవరణ బిల్లు ఆమోదం, వాటర్ గ్రిడ్ పై చర్చ జరిగాయి. విపక్ష సభ్యులు లేకపోవడంతో అధికార పార్టీ సభ్యులే ప్రశ్నించడం, మంత్రులు సమాధానం చెప్పడంతో సభ చప్పగా సాగింది.
రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంతో ఇక సభలో మాట్లాడే అవకాశం లేదని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజాబాట పట్టాయి. కాంగ్రెస్ రైతు భరోసా యాత్రని పాలమూరు నుంచి, టిడిపి-బిజెపిలు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి ఆందోళనలు ప్రారంభించాయి. దీంతో... సభలో టీఆర్ ఎస్, ఎంఐఎం మాత్రమే మిగలడంతో విపక్షాలు లేని వెలితి స్పష్టంగా కనిపించింది. ఇలా సభలో ప్రతిపక్షాలు లేకుండా నడిపితే ఎంత మాత్రం బాగుండదని ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభను షెడ్యూల్ కంటే ముందే ముగించేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. బీఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 10వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా... విపక్షాలు లేకపోవడంతో నేటి సాయంత్రానికే సభను ముగించే యోచన చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more