Pawan Kalyan for Taminadu elections

Pawan kalyan for taminadu elections

Pawan Kalyan, Pawan Kalyans Janasena, Janasena, Tamilnadu, Political News, Pawan for Elections

Central Minister Venkaiah Naidu trying to bring Pawan kalyan for Taminadu elections. He plans to champaign in telugu peoples area for BJP.

తమిళనాట ప్రచారం కోసం పవన్.?

Posted: 04/07/2016 03:19 PM IST
Pawan kalyan for taminadu elections

దేశంలో రాజకీయ వేడి రాజుకుంది చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వేడితో వేసవి మరింత వేడెక్కింది. అన్నింటికి మించి తమిళనాడులో అయితే రాజకీయం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలో చేరుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే ఇంత హడావిడి మధ్యన అక్కడ మన తెలుగు తేజం పవన్ కళ్యాన్ గురించి ఓ వర్గం ఆలోచిస్తోంది. గతంలో ఏపిలో సాధారణ ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత తెలుగుదేశం, బిజెపి పార్టీల కూటమికి తన సపోర్ట్ తెలిపారు. అందుకు ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. మరి అలాగే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అయితే తాజాగా బిజెపి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద మరోసారి దృష్టిసారించారు.

విభజన తర్వాత మొదటిసారి ఏపిలో ఎన్నికలు జరిగితే అక్కడి ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి పూర్తి మెజార్టీతో గెలిపించారు. అయితే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటే అది పొరపాటే. ఏపిలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ పవన్ కళ్యాణ్ ప్రభావం గురించి ఎన్నోసార్లు పార్టీలో చర్చించారు. తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ వల్ల వచ్చిన ఆ ఓట్ల వల్లే తమ పార్టీ ఓటమిచవిచూసిందని అన్నార. రోజా కూడా ఇదే మాట అన్నారు. పవన్ కల్యాణ్ లేకుండా ఓట్లు అడిగితే తెలుగుదేశం పార్టీ నాయకులను కనీసం పట్టించుకోనుకూడా పట్టింకోరు అని.

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న పవర్ ఏంటో ప్రధాని మోదీకి కూడా తెలుసు. అందుకే ఆయన రెడ్ కార్పెట్ పై పవన్ కు స్వాగతం పలికారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు,ఎన్నిలక సభల్లో పవన్ కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించారు .అందుకే మోదీకి పవన్ అంటే చాలా అభిమానం. ఆయనను ఓ పార్టీ అధినేతగా బాగా ఇష్టపడతారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. తొమ్మిది సంవత్సరాలు ఏకచక్రాధిపత్యాన్ని కొనసాగించిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పవర్ ఏంటో బాగా తెలుసు. అందుకే ఆయనకు స్వయంగా వచ్చి మరీ స్వాగతం పలుకుతారు.

ఇక ఇప్పుడు తమిళనాడు ఎన్నికల కోసం జనసేన అధినేతను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మోదీ సర్కార్ లో కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పవన్ ను తమిళనాట ప్రచారానికి ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. తమిళనాట ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉంటారో అక్కడ పవన్ కళ్యాణ్ తో ప్రచారం నిర్వహిస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని పార్టీ క్యాడర్ భావిస్తోందట. గతంలో ఏపిలో బిజెపి, టిడిపి కూటమికి మద్దతు పలికిన పవన్ మరోసారి బిజెపి పార్టీ కోసం రంగంలోకి దిగుతారా అని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చొట పవన్ చేత ఎన్నికల ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని బిజెపి పార్టీ వేసిన అంచనాలు అక్షరాల నిజం. తెలుగు సినిమాల మూలంగా ఆయన వ్యక్తిత్వం మూలంగా కోట్ల మంది ఆయనకు అభిమానులుగా మారారు. జనసేన పార్టీ పెట్టినా కానీ మిగిలిన పార్టీల మాదిరిగా కాకుండా సంస్థాగత మార్పుల కోసం కట్టుబడ్డ పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఇష్టమే. రాజధాని భూముల విషయంలో తమకు పవన్ అండగా నిలవాలని కోరితే వారికి అండగా నిలిచారు. చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ప్రజల కష్టాలను తీర్చాలని కోరారు. అలా ప్రజలకు దగ్గరగా ఉన్నారు పవన్.

తమిళనాట కూడా పవన్ కల్యాణ్ అంటే అభిమానించే, ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు. వారి అభిమానాన్ని ఓట్ల రూపంలో బిజిపి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే గతకొంత కాలంగా తమిళనాట జరగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ లాంటి వ్యక్తి అక్కడికి ప్రచారానికి వెళ్లకపోవడమే మంచిది అనిపిస్తోంది. రజినీకాంత్ లాంటి వ్యక్తులకే అక్కడ రాజకీయాలు నచ్చవు కనుకే వారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  మరి అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ప్రచారం నిర్వహించి,. బిజెపికి ఓట్లు వెయ్యండి అని అడుగుతారని మాత్రం అనుకోవడం లేదు. తనకు ఆదాయాన్ని తీసుకువచ్చే సినిమాల గురించే ఆయన పెద్దగా పట్టించుకోరు. కమర్షియల్ వ్యాల్యూస్ కోసం కాకుండా మోరల్ వ్యాల్యూస్ కోసం ఆయన పరితపిస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Pawan Kalyans Janasena  Janasena  Tamilnadu  Political News  Pawan for Elections  

Other Articles